Monkeypox | మంకీపాక్స్ కట్టడికి డబ్ల్యూహెచ్ఓ చొరవ చూపాలి : వైద్య నిపుణులు
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు వ్యాప్తి చెందిన మంకీపాక్స్ వైరస్‌ను కట్టడి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు కోరారు.
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు వ్యాప్తి చెందిన మంకీపాక్స్ వైరస్‌ను కట్టడి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ, ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు కోరారు. కొవిడ్-19ను గుర్తించి నియంత్రించడంలో జాప్యం జరగడంతో వైరస్ విజృంభించిన గత పొరపాట్లకు తావివ్వకుండా మంకీపాక్స్ నియంత్రణకు చొరవ చూపాలని వారు పిలుపు ఇచ్చారు.
కొవిడ్ తరహాలో మంకీపాక్స్ ఇతరులకు సంక్రమించడం, కరోనా వైరస్ తీవ్రత ఈ ఇన్ఫెక్షన్కు లేకపోయినా మంకీపాక్స్‌కు గురైన వ్యక్తి ఐసోలేషన్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ వంటి మార్గదర్శకాలపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. కరోనా వైరస్ పలు దేశాల్లో ఎండెమిక్ దశలో ఉన్నా మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి ప్రమాదం పొంచిఉన్నందున సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జెనీవా సెంటర్ ఫర్ ఎమర్జింగ్ వైరల్ డిసీజెస్ ప్రొఫెసర్ ఇసబెల్లె ఎకెర్లీ కోరారు.
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌ను గుర్తిస్తే దీని కట్టడికి, పరిశోధనకు అవసరమైన నిధులు సమకూరుతాయి. మరోవైపు ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ఇప్పటివరకూ దీనిపై అత్యవసర కమిటీ ఏర్పాటు కాలేదని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్‌ల డైరెక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

