Carrot Salad | క్యారెట్ సలాడ్‌తో మెరిసే చర్మం సొంతం
Carrot Salad : వయసు పెరిగే కొద్దీ చర్మం సాగడం, చర్మంపై ముడతలు వంటివి సహజం. అయితే ఏజింగ్‌ను ఆలస్యం చేస్తూ చర్మం నిగారింపుతో ఉండేలా చూసుకోవాలంటే తాజా పండ్లు, కూరగాయల వంటి ఆరోగ్యకర ఆహారంతో సాధ్యమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
Carrot Salad : వయసు పెరిగే కొద్దీ చర్మం సాగడం, చర్మంపై ముడతలు వంటివి సహజం. అయితే ఏజింగ్‌ను ఆలస్యం చేస్తూ చర్మం నిగారింపుతో ఉండేలా చూసుకోవాలంటే తాజా పండ్లు, కూరగాయల వంటి ఆరోగ్యకర ఆహారంతో సాధ్యమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఇక క్యారట్‌తో చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని, ఎర్రని క్యారెట్లలో రుచితో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. విటమిన్ ఏ (రెటినాల్) అధికంగా ఉండటంతో క్యారెట్లు చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి.
క్యారెట్లో ఉండే రెటినాల్ చర్మ కణాల ఉత్పత్తి ప్రేరేపించడంతో పాటు కొలాజెన్ ఉత్పత్తికి ఉపకరిస్తుందని దీంతో చర్మంపై ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరవని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పేర్కొంది. బీటా కరోటిన్ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ ఏను పొందవచ్చని ఎన్హెచ్ఎస్ యూకే తెలిపింది.
బీటా కరోటిన్ను మన శరీరం రెటినాల్గా మార్చుకుంటుంది. క్యారెట్లలో బీటా కరోటిన్ అధికంగా ఉంటుంది. ఇక క్యారెట్లను ఎలా తీసుకుంటే ఆరోగ్యకర ప్రయోజనాలు అందుతాయనేది న్యూట్రిషనిస్ట్ పూజ బొహ్ర ఇన్‌స్టా పోస్ట్‌లో వివరించారు. రెడ్ క్యారెట్ సలాడ్ తయారుచేసుకుని తాగడం ద్వారా మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
ఇక క్యారెట్ సలాడ్ తయారుచేసే విధానాన్ని పూజ ఇన్‌స్టా వీడియోలో వివరించారు. క్యారెట్స్‌లోని రెటినాల్‌తో మెరిసే చర్మం సొంతమవుతందని, కొబ్బరి నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, సీ సాల్ట్ నువ్వుల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. వెనిగర్ జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని పూజ వివరించారు.
Read More :
Rose Water | వామ్మో.. రోజ్ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా ?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

