Moringa Leaves | మన చుట్టూ పరిసరాల్లో అనేక చెట్లు పెరుగుతుంటాయి. కానీ మనం వాటి గురించి అంతగా పట్టించుకోం. అయితే అలాంటి చెట్లు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటిల్లో మునగాకు చెట్టు కూడా ఒకటి. మునగ చెట్టును చాలా మంది అంతగా పట్టించుకోరు. కానీ ఆయుర్వేదం ప్రకారం మునగాకులు సుమారుగా 300 రకాలకు పైగా వ్యాధులను నయం చేయగలవు అని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజూ ఉదయం మునగాకులు నాలుగు తింటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని, అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు. మునగాకును రోజూ తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయంటున్నారు.
మునగాకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడం తేలికవుతుంది. మునగాకులను తినడం వల్ల కొవ్వు కణాలు సులభంగా కరిగిపోతాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోదు. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. మునగాకుల్లో అధిక మొత్తంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఎముకలు, దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. మునగాకు రోజూ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు రోజూ మునగాకును తింటుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. దీని వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి రాకుండా ఉంటుంది. ఎముకల సాంద్రత పెరుగుతుంది.
మునగాకుల్లో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో సాధారణ దగ్గు, జలుబు నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్ సి వల్ల మన శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్లు నాశనం అవుతాయి. మనం రోగాల బారిన పడకుండా ఉంటాము. మునగాకుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను, బీపీని తగ్గిస్తాయి. మునగాకుల్లో పొటాషియం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. కండరాల పనితీరు మెరుగు పడుతుంది.
మునగాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. మునగాకులు షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. మునగాకుల్లో విటమిన్లు ఇ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మునగాకులను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్య తగ్గుతుంది. తరచూ మునగాకులను తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మునగాకులను రోజూ తినడం వల్ల లివర్, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి డిటాక్స్ అవుతాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ డ్యామేజ్ అయిన వారు మునగాకులను తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. లివర్ మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది. యాక్టివ్‌గా పనిచేస్తుంది. మునగాకులను తినడం వల్ల లివర్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇలా మునగాకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ వాటిని తినడం మరిచిపోకండి.