కొలాజెన్ కావాలంటే..
కొలాజెన్ మన శరీరంలో తయారయ్యే ఒక ప్రొటీన్. ఇది మన శరీర కణాల మధ్య కనెక్టివ్ టిష్యూగా పనిచేస్తుంది. కణజాలాన్ని పట్టి ఉంచుతుంది. శరీరంలో అమైనో ఆమ్లాల సంశ్లేషణ ద్వారా ఇది తయారవుతుంది.
చర్మం, కురుల నిగారింపునకు కొలాజెన్ చాలా అవసరమని విన్నాను. ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా కొలాజెన్ వృద్ధి చేసుకోగలం. కొలాజెన్ సప్లిమెంట్ల వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా?
- ఓ పాఠకురాలు
కొలాజెన్ మన శరీరంలో తయారయ్యే ఒక ప్రొటీన్. ఇది మన శరీర కణాల మధ్య కనెక్టివ్ టిష్యూగా పనిచేస్తుంది. కణజాలాన్ని పట్టి ఉంచుతుంది. శరీరంలో అమైనో ఆమ్లాల సంశ్లేషణ ద్వారా ఇది తయారవుతుంది. చర్మం, వెంట్రుకలు, ఎముకలు, మృదులాస్థి తదితర భాగాల్లో కణాలకు పటుత్వాన్ని, సాగే గుణాన్ని ఇస్తుంది. అయితే, వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే చిన్నతనంలో పకడ్బందీగా ఒకదానికొకటి ముడివడి ఉండే కణజాల వ్యవస్థ, ఆ తర్వాత కాస్త గజిబిజిగా తయారవుతుంది. అతిగా ఎండలో తిరగడం, కాలుష్యం, మద్యపానం, ధూమపానం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం లాంటివి కూడా కొలాజెన్ స్థాయి త్వరగా పడిపోవడానికి కారణాలు. సమతులాహారం, చక్కని వ్యాయామం ద్వారా మెరుగుపడేలా చూసుకోవచ్చు.
మాంసం, చేపల్లో కొలాజెన్ ఉత్పత్తికి పనికొచ్చే పోషకాలు ఎక్కువ. ఇది శరీరంలో తయారయ్యే ప్రొటీన్. అందువల్లే మొక్కల్లో కొలాజెన్ లభించదు. కాబట్టి వెజిటేరియన్ కొలాజెన్ పేరుతో ఎవరైనా సప్లిమెంట్లు అమ్మితే తీసుకోవద్దు. వీటివల్ల పెద్దగా ఫలితం ఉండదు. నీళ్లు బాగా తాగడం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, గింజల్లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు, మంచి నిద్ర… కొలాజెన్ ఉత్పత్తిని వృద్ధి చేస్తాయి. అన్నిటికీ మించి సంతోషంగా ఉండటం, సానుకూల దృక్పథంతో వ్యవహరించడం వల్ల శరీరం కూడా ఉత్తేజితం అవుతుంది. అన్ని చర్యలూ చక్కగా జరుగుతాయి. ఎంతో కళగాకనిపిస్తాం. కొలాజెన్ జుట్టుకే కాదు మీకూ అవసరమే.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

