Sleep Apnea | నిద్రలేమి ప్రాణాంతకం కావొచ్చు!.. సమస్య ఎలా బయటపడాలంటే..?
Sleep Apnea | నిద్ర సంబంధిత సమస్యలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రాత్రి సమయంలో రాత్రి సమయంలో సరైన నిద్రలేకపోవడంతో మధుమేహం, గుండెజబ్బులు, ఆందోళన, ఒత్తిడి తదితర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. కొన్ని రకాల నిద్ర సంబంధిత రుగ్మతలు ప్రాణాంతంగా మారే అవకాశం ఉన్నది. స్లీప్ అప్నియా సైతం తీవ్రమైన సమస్యని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో తరుచుగా తీవ్రమైన సమస్యలను ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని, కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో నిద్ర సంబంధిత రుగ్మతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్లీపింగ్ అప్నియా.. సమస్య ఉంటే నిద్రపోతున్న సమయంలో శ్వాస తరుచుగా కొన్ని సెకన్ల పాటు ఆగిపోతుంది. ఎక్కువ గురక పెట్టినా.. నిద్ర తర్వాత అలసిపోయినట్లుగా అనిపిచినా అది స్లీప్ అప్నియాకు సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. స్లీప్ అప్నియా లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. సకాలంలో సరైన చికిత్సను తీసుకుంటే గుండె, ఇతర సమస్యల సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.
స్లీప్ అప్నియా అంటే ఏంటీ..?

స్లీప్ అప్నియా నిద్రకి సంబంధించిన బ్రీథింగ్ డిజార్డర్. ఈ రుగ్మత కారణంగా నిద్రలో శ్వాస తీసుకోవడం కొన్ని సెకన్ల పాటు ఆగిపోతుంది. గొంతులో ఉన్న మజిల్స్ ఓవర్ రిలాక్సేషన్తో ఇలా జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్లీప్ అప్నియా రాత్రి సమయంలో చాలాసార్లు జరగవచ్చు. అలా జరిగినప్పుడు టిష్యూలకి కావాల్సినంత ఆక్సిజెన్ లభించదు. శ్వాస సరిగ్గా అందక హఠాత్తుగా నిద్ర నుంచి మెలకువ రావడంతో పాటు సరైన నిద్ర ఉండదు. అయితే బిగ్గరగా గురకపెట్టడం, నిద్రలో ఆకస్మిక శ్వాస సమస్యలు, ఉదయం లేవగానే నోరు తరచుగా పొడిబారడం, ఉదయం తీవ్రమైన తలనొప్పి, నిద్ర పట్టడంలో ఇబ్బంది (insomnia), అధిక పగటి నిద్ర (hypersomnia) తదితర సమస్యలుంటాయని, ఇందులో రెండుకంటే ఎక్కువ లక్షణాలుంటే స్లీప్ అప్నియాకు
సంకేతాలని నిపుణులు పేర్కొంటున్నారు.
స్లీప్ అప్నియా నివారణకు చిట్కాలు..

అధిక బరువు సమస్య ఉన్నవారిలో స్లీప్ అప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బరువును తగ్గడం ద్వారా సమస్య నుంచి బయటపడే అవకాశాలుంటాయి. అలాగే బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా గుండె, మధుమేహం బారినపడకుండా తమని తాము కాపాడుకోవచ్చు. స్లీప్ అప్నియా సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేస్తే మంచి నిద్ర ఉంటుందని, స్లీపింగ్ డిజార్డర్స్ అధిగమించడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసే వారిలో బరువు పెరగడానికి తక్కువ అవకాశాలుంటాయి. తద్వారా ఇతర సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

