ఇక సర్జరీ లేకుండా కాటరాక్ట్ చికిత్స.. !!
కాటరాక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చూపును కోల్పోతున్నారు. దీనికి ఇప్పటివరకూ సర్జరీ మాత్రమే ఉంది. ఇది చాలా సున్నితత్వంతో కూడుకున్నది. కాగా, లండన్ పరిశోధకులు సర్జరీ అవసరం లేకుండా కాటరాక్ట్కు చికిత్స చేసే డ్రగ్‌ను కనుగొన్నారు.
కాటరాక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చూపును కోల్పోతున్నారు. దీనికి ఇప్పటివరకూ సర్జరీ మాత్రమే ఉంది. ఇది చాలా సున్నితత్వంతో కూడుకున్నది. కాగా, లండన్ పరిశోధకులు సర్జరీ అవసరం లేకుండా కాటరాక్ట్కు చికిత్స చేసే డ్రగ్‌ను కనుగొన్నారు.
యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆక్సిస్టెరాల్ సమ్మేళనంపై అధునాతన ఆప్టికల్ టెస్ట్‌లు నిర్వహించారు. దీనిని యాంటీ కాంటారాక్ట్ డ్రగ్‌గా ప్రతిపాదించారు. ప్రయోగశాల ట్రయల్స్‌లో ఆక్సిస్టెరాల్ సమ్మేళనం వీపీ1-001తో చికిత్స రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రొఫైల్‌లో మెరుగుదలను చూపించింది.
ఇది 61 శాతం లెన్స్‌లలో అధిక ఫోకస్ చేసే సామర్థ్యాన్ని నిర్వహించేందుకు అవసరమైన కీలక ఆప్టికల్ పరామితి. దీనర్థం లెన్స్ ప్రోటీన్ ఆర్గనైజేషన్ పునరుద్ధరణ జరుగుతోంది. దీని ఫలితంగా లెన్స్ బాగా దృష్టి కేంద్రీకరించగలదు. 46 శాతం కేసులలో లెన్స్ అస్పష్టత తగ్గింపు కనిపించింది. “ఈ అధ్యయనం యాంటీ క్యాటరాక్ట్ డ్రగ్‌గా ప్రతిపాదించిన సమ్మేళనం. సానుకూల ప్రభావాలను చూపించింది. అయితే, లెన్స్ ఆప్టిక్స్‌పై ఇంతకు ముందెన్నడూ పరీక్షించలేదు. ప్రపంచంలోనే ఈ రకమైన పరిశోధన ఇదే మొదటిది” అని ప్రొఫెసర్ బార్బరా పియర్సియోనెక్ చెప్పారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

