Sugar Cane Juice | చెరకు రసాన్ని రోజూ తాగవచ్చా.. నిపుణులు ఏమంటున్నారు..?
వేసవి కాలంలో చల్లగా, తీపిగా ఉండే చెరకు రసం చాలా మందికి ఇష్టమైన పానీయం. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు వేడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తారు. అయితే చెరకు రసం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దాని పోషక విలువలు, పరిమితుల గురించి తెలుసుకోవడం కూడా అవసరం.
Sugar Cane Juice | వేసవి కాలంలో చల్లగా, తీపిగా ఉండే చెరకు రసం చాలా మందికి ఇష్టమైన పానీయం. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు వేడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తారు. అయితే చెరకు రసం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దాని పోషక విలువలు, పరిమితుల గురించి తెలుసుకోవడం కూడా అవసరం. ఒక మధ్యస్థ గ్లాసు చెరకు రసంలో సుమారు 25 నుంచి 30 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఇది దాదాపు ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల చక్కెరకు సమానం. ఇందులో ప్రధానంగా సుక్రోజ్ ఉండగా, కొద్దిపాటి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కూడా ఉంటాయి. చక్కెర ద్రవరూపంలో ఉండటం వల్ల అది రక్తప్రసరణలోకి చాలా వేగంగా చేరుతుంది. దీంతో శరీరానికి తక్షణ శక్తి లభించి చల్లదన అనుభూతి చెందుతారు. అందుకే వేసవిలో చెరకు రసం తాగిన వెంటనే ఉల్లాసంగా అనిపిస్తుంది.
రోజూ తీసుకోవచ్చా..
చెరకు రసంలో పొటాషియం, పాలీఫినాల్స్ వంటి కొన్ని పోషకాలు కూడా ఉంటాయి. పొటాషియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వేడి వాతావరణంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే చెరకు రసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం చెరకు ముక్కలో ఉండే పీచు పదార్థం రసంలో చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ప్రోటీన్ కూడా దాదాపు ఉండదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర వేగంగా పెరగడం వల్ల కొంతసేపు అధిక శక్తి లభించినట్లు అనిపించినా, ఆ తర్వాత శక్తి స్థాయి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీంతో అలసట, నిద్రమత్తు, బద్ధకం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.
ఈ సమస్యలు ఉంటే వద్దు..
ఇన్సులిన్ రెసిస్టెన్స్, మధుమేహం లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో బాధపడుతున్న వారు చెరకు రసాన్ని తరచూ తీసుకోవడాన్ని నివారించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయులపై ప్రభావం చూపిస్తుంది. చెరకు రసం విషయంలో మరో ముఖ్యమైన అంశం పరిశుభ్రత. రసం కంటే దానిని తయారు చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండటం మరింత ముఖ్యం. పరిశుభ్రత లేని ప్రాంతాల్లో తయారయ్యే రసంలో సూక్ష్మజీవులు చేరి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.
అప్పుడప్పుడు తీసుకోవచ్చు..
అందువల్ల చెరకు రసాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే దానిని రోజువారీ ఆరోగ్య పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే వేసవి శీతల పానీయంగా భావించడం మంచిది. పరిమిత మోతాదులో, పరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారైన చెరకు రసాన్ని తీసుకుంటే దాని రుచి, తాజాదనాన్ని ఆస్వాదించడంతోపాటు ఆరోగ్యపరమైన ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

