Breast Feeding | కంటేనే పాలివ్వాలా? సరోగసీ తల్లులు పాలు పట్టవచ్చా?
Breast Feeding | సరోగసీ ద్వారా పిల్లల్ని కనేవారు కూడా బిడ్డకు చనుబాలు పట్టవచ్చని చదివాను. ఇది సాధ్యమేనా? మాకు పిల్లలు లేరు. ఓ పసికందును దత్తత తీసుకుందాం అనుకుంటున్నా. ఆ బిడ్డకు నేను పాలిచ్చే అవకాశం ఉందా?
Breast Feeding | సరోగసీ ద్వారా పిల్లల్ని కనేవారు కూడా బిడ్డకు చనుబాలు పట్టవచ్చని చదివాను. ఇది సాధ్యమేనా? మాకు పిల్లలు లేరు. ఓ పసికందును దత్తత తీసుకుందాం అనుకుంటున్నా. ఆ బిడ్డకు నేను పాలిచ్చే అవకాశం ఉందా?
– ఓ పాఠకురాలు
మీరు చదివింది నిజమే. బిడ్డకు జన్మనివ్వక పోయినా.. పాలిచ్చి పెంచాలనే బలమైన ఆకాంక్ష ఉంటే అసాధ్యమేం కాదు. సరోగసీ ద్వారా బిడ్డను కన్నా, పసిబిడ్డను దత్తతకు తెచ్చుకున్నా.. చనుబాలు పట్టాలి అనుకుంటే, ఆ అవకాశం ఉంటుంది. అయితే ఇది అరుదుగా జరిగే విషయం. దీనికోసం మీరు కొద్దినెలల ముందు నుంచే మానసికంగా సిద్ధం కావాలి. పాపాయికి మీరే తల్లి అని మనస్ఫూర్తిగా నమ్మాలి. బిడ్డ ఆకలి తీర్చాల్సిన బాధ్యత మీమీద ఉందని తీర్మానించుకోవాలి. చంటిబిడ్డను తెచ్చుకున్న తర్వాత కూడా.. పాలు పట్టే భంగిమలో కూర్చుని తరచూ రొమ్ము అందిస్తూ ఉండాలి.
బిడ్డ చీకడం మొదలుపెట్టాక ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొద్ది రోజుల్లో పాల ఉత్పత్తి నిజంగానే ప్రారంభం అవుతుంది. నిజానికి పాల ఉత్పత్తి అనేది మానసిక ప్రక్రియ. గర్భవతిగా ఉన్న సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లతో పాటు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువ స్థాయిలో విడుదల అవుతుంది. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ప్రొలాక్టిన్ స్థాయులు అలాగే ఉంటాయి. మిగతా రెండు హార్మోన్ల స్థాయులు తగ్గిపోతాయి. ప్రొలాక్టిన్ పాల ఉత్పత్తికి పనికొచ్చే హార్మోన్. పాపాయి అవసరానికి తగ్గట్టు ఇది పాల తయారీకి సహకరిస్తుంది. మీరు బిడ్డను తెచ్చుకునేందుకు నెలల ముందే సంప్రదిస్తే.. డాక్టర్లు ఈ తరహా హార్మోన్ థెరపీని సూచిస్తారు. ఇక పసిస్పర్శ తగిలినప్పుడు, బిడ్డ రొమ్మును చీకుతున్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దాని వల్ల పాలు ధారకడతాయి. కొందరు మెంతికూర, వెల్లుల్లి, పచ్చి బొప్పాయి లాంటి పాలు పడే ఆహారాన్నీ తీసుకుంటారు. బ్రెస్ట్పంప్ను క్రమపద్ధతిలో వాడుతూ ఉంటే కూడా కొద్ది రోజులకు పాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి నవమాసాలు మోసి కనక పోయినా బిడ్డకు పాలివ్వగలిగే శక్తి స్త్రీ శరీరానికి ఉంటుంది. అయితే ఇది అందరికీ వీలవుతుందని చెప్పలేం.
– డాక్టర్ పి. బాలాంబ, సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

