Breakfast Choice | ప్రొటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్‌తో ఏకాగ్రత : తాజా అధ్యయనంలో వెల్లడి
Breakfast Choice : ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఏకాగ్రత పెరగడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Breakfast Choice : ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఏకాగ్రత పెరగడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 30 ఏండ్లలోపు వయసున్న ఊబకాయం కలిగిన మహిళలపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిపై ప్రొటీన్ రిచ్, కార్బోహైడ్రేట్ రిచ్, బ్రేక్‌ఫాస్ట్‌కు దూరంగా ఉండటం వంటి భిన్న పరిస్ధితులపై పరిశోధన సాగించారు.
అర్హాస్ యూనివర్సిటీ, డెన్మార్క్ చేపట్టిన ఈ పరిశోధనలో ప్రొటీన్ అధికంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌తో ఏకాగ్రత, తృప్తి భావన పెరిగినట్టు గుర్తించినా బ్రేక్‌ఫాస్ట్ నిలిపివేయడం, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడంతో పోలిస్తే రోజువారీ సగటు క్యాలరీల విషయంలో తగ్గుదల లేదని గుర్తించారు.
కేవలం ప్రొటీన్ అధికంగా ఉన్న అల్పాహారం తీసుకోవడం సరిపోదని, ఇది ఒక్కటే దీటైన పరిష్కారం కాదని అధ్యయన రచయిత, అసిస్టెట్ ప్రొఫెసర్ మెటీ హన్సెన్ పేర్కొన్నారు. ప్రొటీన్‌తో కూడిన ఆహారంతో కడుపు నిండిన భావన కలగడం బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయని అన్నారు. పోషకాహార వ్యూహం సరైన ఫలితాలు ఇస్తుందని వెల్లడైనా కేవలం ప్రొటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం ఒక్కటే సరిపోదని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.
Read More :
Farmers Protest | నిరసనలో ట్రాక్టర్ ట్రాలీలు ఎందుకు..? హైకోర్టు మందలింపు..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

