న్యూఢిల్లీ : నిర్ధిష్ట పద్ధతిలో పలు భంగిమల్లో చేసే సూర్య నమస్కారాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని (Health Tips) నిపుణులు చెబుతున్నారు. శ్వాస మీద దృష్టి సారిస్తూ 12 భంగిమల్లో శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ సాగే ఈ ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సూర్య నమస్కారాలను ఓ నిర్ధిష్ట పద్ధతిలో శరీరంలోని వివిధ భాగాలను ప్రేరేపితం చేసేలా ప్రాక్టీస్ చేయాలి.
శారీరక, మానసిక ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు దివ్యాసనంగా యోగ నిపుణులు చెబుతారు. నిలుచునే భంగిమతో ఈ ఆసనాలు ప్రారంభమై అదే భంగిమలో ముగుస్తాయి. సూర్యనమస్కారాలను సరైన పద్ధతిలో నిత్యం ఆచరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేసేలా సూర్య నమస్కారాలను అనుసరించాలి.
ప్రతి భంగిమంలో దీర్ఘ శ్వాసలు తీసుకోవడంతో పాటు మెల్లిగా మరో భంగిమలోకి మారాల్సి ఉంటుంది. ఉదయాన్నే సూర్యనమస్కారాలతో రోజును ప్రారంభించడం ద్వారా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే శక్తి సమకూరుతుంది. సరైన టెక్నిక్‌తో సూర్యనమస్కారాలను ప్రాక్టీస్ చేసేలా అర్హులైన యోగ గురువు సమక్షంలో వీటిని ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సూర్య నమస్కారాలతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే…
ఫ్లెక్సిబిలిటీ మెరుగుదల
రక్త ప్రసరణ
బరువు నియంత్రణ
ఒత్తిడి, ఆందోళనకు చెక్
జీర్ణక్రియ మెరుగుదల
కండరాల బలోపేతం