Beetroot Ragi Dosa | బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ డిష్ : ఈ అల్పాహారంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
దోశను ఆరోగ్యంగా మలిచేందుకు రోజును ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆరంభించేందుకు విభిన్నంగా ప్రయత్నించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే బీట్రూట్ రాగి దోశను (Beetroot Ragi Dosa) ట్రై చేయడం మేలని చెబుతున్నారు.
న్యూఢిల్లీ : సౌత్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది దోశ. ఈ దక్షిణాది డిష్‌ను ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. చట్నీ, సాంబార్‌తో దోశ తినేందుకు పిల్లలతో పాటు పెద్దలూ ఇష్టపడుతుంటారు. అయితే ఈ దోశను ఆరోగ్యంగా మలిచేందుకు రోజును ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆరంభించేందుకు విభిన్నంగా ప్రయత్నించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే బీట్రూట్ రాగి దోశను (Beetroot Ragi Dosa) ట్రై చేయడం మేలని చెబుతున్నారు. కలర్ఫుల్గా, క్రిస్పీగా దాంతో పాటు సూపర్ హెల్తీ దోశను తరచూ తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయని న్యూట్రిషనిస్టులు పేర్కొంటున్నారు. బీట్రూట్ రాగి దోశ పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ డిష్‌గా చెబుతున్నారు. బీట్రూట్, రాగి రెండింటిలో ఆరోగ్యకర పోషకాలు మెండుగా ఉన్నాయి. రాగిలో క్యాల్షియం, ప్రొటీన్, డైటర్ ఫైబర్లతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి.
బరువు పెరుగుతారని, అధిక క్యాలరీలు ఉంటాయనే అపోహలు లేకుండా బీట్రూట్ రాగి దోశను ఆస్వాదించవచ్చు. ఇక రాగి తరహాలోనే బీట్రూట్లోనూ ఫైబర్, పొటాషియం, విటమిన్ సీ, ఐరన్, ఫోలేట్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. బీపీ నియంత్రణ, వాపు తగ్గుదల, అనీమియా నివారణ, చర్మ సంరక్షణ వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను బీట్రూట్ రాగి దోశ ద్వారా పొందే అవకాశం ఉంది.
Read More :
Telangana | నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే.. ఓటర్లకు సీఈవో వికాస్‌రాజ్ విజ్ఞప్తి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

