అవకాడో టోస్ట్‌కు భారీ డిమాండ్..స్ట్రీట్ ఫుడ్‌తో పోటీ పడేనా..!
స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఎలాంటి టేస్ట్నైనా, టోస్ట్నైనా ఇట్టే స్వాగతిస్తారు. పోషకాల గనిగా పేరొందిన ఖరీదైన అవకాడో టోస్ట్‌ను సైతం జనం ఇష్టంగా ఆరగిస్తున్నారు.
స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఎలాంటి టేస్ట్నైనా, టోస్ట్నైనా ఇట్టే స్వాగతిస్తారు. పోషకాల గనిగా పేరొందిన ఖరీదైన అవకాడో టోస్ట్‌ను సైతం జనం ఇష్టంగా ఆరగిస్తున్నారు. సూరత్‌లోని ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో అవకాడో టోస్ట్‌ను అమ్మకానికి పెడితే జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. రూ. 200 ఖరీదైనా, ధరను లెక్కచేయకుండా జనాలు అవకాడో టోస్ట్‌ను టేస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే ఆరోగ్యానికి అవకాడో ఎంతో మంచిదని తెలిసిన ప్రజలు ఈ టోస్ట్‌ను ఇష్టంగా తిన్నారు. మరి ఈ అవకాడో టోస్ట్ మున్ముందూ పానీపూరి, చాట్ వంటి చవకైన స్ట్రీట్ ఫుడ్‌కు పోటీ ఇస్తుందా అనే విషయాలపై నిపుణులు, చెఫ్‌లు, రెస్టారెంట్ నిర్వాహకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అవకాడోలో ఫైబర్, బీ6, విటమిన్ సీ, పొటాషియం, విటమిన్ ఈ, ఫోలేట్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రజలు ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలనే అవగాహనతో హెల్ధీ ఫుడ్ వైపు మొగ్గుచూపుతున్నారని మిచ్లీన్ స్టార్ చెఫ్ రోహత్ ఘాయ్ చెప్పుకొచ్చారు. అవకాడోకు తనదైన ఫ్లేవర్ లేనందున ఎలాంటి ఫుడ్ కాంబినేషన్ ప్రయోగాలకైనా వేదికవుతుందని అన్నారు. అవకాడోలో ఎన్నో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని, ఇందులో కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును తగ్గించే పదార్ధాలున్నాయని అందుకే అవకాడో ఇంతగా పాపులర్ అయిందని ఫుడ్ కన్సల్టెంట్, రెస్టారెంట్ నిర్వాహకులు శంతను గుప్తే చెప్పుకొచ్చారు.
అవకాడో దిగుమతులు ఇటీవల పెరగడంతో పాటు లాభదాయకత అధికంగా ఉంటుందనే అంచనాతో దేశీయంగానూ దీన్ని పలువురు పండిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అవకాడో ధర కొంత దిగివస్తే వీటితో తయారుచేసే పదార్ధాలు, స్నాక్స్ దేశీ స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్‌లకు దీటైన పోటీ ఇస్తాయని భావిస్తున్నారు.
Read More :
Nita Ambani | పదేళ్ల తర్వాత కాశీకి వెళ్లిన నీతా అంబానీ.. రోడ్‌సైడ్ షాప్‌లో చాట్ తిని
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

