Health tips : అవకాడోతో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అవకాడోలు అధికంగా తీసుకునే కుటుంబాలు, పరిమితంగా తీసుకునే కుటుంబాలపై జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు.
అవకాడోలు వారానికి 14 చొప్పున ఆరువారాలు తీసుకున్న వారిలో, వీటిని తక్కువగా వారానికి మూడు చొప్పున తీసుకున్న వారితో పోలిస్తే గుండె ఆరోగ్యాన్ని సూచించే కీలక సంకేతాలు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడైందని చెప్పారు. అవకాడోలు అధికంగా తీసుకున్న వారిలో మొత్తం కాలరీలు పరిమాణం తక్కువగా ఉన్నట్టు తేలింది. అవకాడోలో విటమిన్ సీ, విటమిన్ ఈ, విటమిన్ కే, బీ6తో పాటు రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, లుటిన్, బీటా కేరటిన్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అవకాడోలో ఉండే ఫైబర్‌తో మలబద్ధకం నివారించవచ్చు. అవకాడోలో ఉండే ఔషధ గుణాలతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సైతం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. బరువు తగ్గాలనుకునే వారికీ ఈ సూపర్ ఫ్రూట్ మెరుగైన ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.