ఫైబ్రాయిడ్స్ గడ్డలా!? ఆందోళన వద్దు!
ఫైబ్రాయిడ్స్.. మహిళలు ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యల్లో ఇవీ ఒకటి. పెద్దగా హానికరం కాని ఈ ఫైబ్రాయిడ్స్.. గర్భసంచిలో గడ్డల్లా పెరుగుతూ, బాధితులకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ గడ్డలు క్యాన్సర్‌గా మారుతాయేమోనని కొందరు ఆందోళన పడుతుంటారు.
ఫైబ్రాయిడ్స్.. మహిళలు ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యల్లో ఇవీ ఒకటి. పెద్దగా హానికరం కాని ఈ ఫైబ్రాయిడ్స్.. గర్భసంచిలో గడ్డల్లా పెరుగుతూ, బాధితులకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ గడ్డలు క్యాన్సర్‌గా మారుతాయేమోనని కొందరు ఆందోళన పడుతుంటారు. అయితే ఇవి క్యాన్సర్‌గా మారవు. కాకపోతే చాలా అరుదుగా, కొందరిలో లియోమయోసార్కోమా అనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా చాలా అరుదు కావడం వల్ల ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఫైబ్రాయిడ్స్ గడ్డలు గర్భసంచిలో వేర్వేరు పరిమాణాల్లో (సైజుల్లో) పెరుగుతాయి. ఇలా పెరగడం చాలా సాధారణం. ఎంతలా అంటే.. ప్రతి నలుగురిలో.. ఒకరు ఫైబ్రాయిడ్స్ బాధితులే ఉంటారు. ఫైబ్రాయిడ్స్‌ను వైద్యపరిభాషలో యుటెరైన్ మయోమాస్, ఫైబ్రోమయోమాస్, లియోమయోమాస్ అని కూడా పిలుస్తారు. వీటికి ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా.. మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సాధారణంగా 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి.
ఫైబ్రాయిడ్స్ రకాలు :
గర్భసంచిలో గడ్డలు వచ్చిన భాగాన్ని బట్టి, వీటికి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్సిరోస్ ఫైబ్రాయిడ్స్, సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్.. అని పేర్లు ఉంటాయి.
కారణాలు : ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయన్నదానికి పెద్దగా కారణాలు తెలియదు. అయితే శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదులు పెరిగినప్పుడు.. అదే హార్మోన్, ఫైబ్రాయిడ్స్ పెరుగుదలకూ కారణమవుతుందని వైద్యులు గుర్తించారు. ఈస్ట్రోజెన్ సరఫరా తగ్గితే.. ఇవి కూడా క్రమంగా కుంచించుకు పోతాయని తేల్చారు.
లక్షణాలు : ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ, అవి ఉన్న విషయమే తెలియదు. అందుకే చాలామందిలో ఇతర సమస్యల కోసం పరీక్షలు చేస్తుంటే.. ఫైబ్రాయిడ్స్ బయటపడతాయి.
సాధారణ లక్షణాలు :
- రుతుస్రావం సమయంలో తీవ్రమైన రక్తస్రావం, నొప్పి
- కలయిక సమయంలో నొప్పి
- గర్భస్రావం లేదా గర్భధారణ జరగకపోవడం
- గర్భిణిగా ఉన్న సమయంలో సమస్యలు.
- మలవిసర్జన సాఫీగా కాకపోవడం, మూత్రవిసర్జన కూడా ఆగుతూ ఆగుతూ రావడం.
ఈ సమస్యలతో బాధపడే మహిళల్లో రక్తహీనత కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.
పరీక్షలు : యోనిని పరీక్షించినప్పుడు డాక్టర్ల చేతికి ఫైబ్రాయిడ్స్ తగలవచ్చు. మరికొందరిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఇవి ఉన్నట్లు తెలియవచ్చు.
చికిత్స : ట్రానెగ్జామిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కొన్ని గర్భనిరోధక మాత్రలు, లెవో నార్జెస్ట్రల్ ఇంట్రాయుటెరైన్ వంటి విధానాలతో వీటికి చికిత్స చేయవచ్చు. సాధారణ చికిత్సతో తగ్గనప్పుడు కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియలు, ఎండోమెట్రియల్ అబ్లేషన్, యుటెరస్‌కు రక్త సరఫరా చేసే రక్తనాళాన్ని ఆటంకపరచి.. దానికి రక్త సరఫరాను ఆపే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ వంటి ప్రక్రియలతో చికిత్స అందించవచ్చు. నిజానికి ఇది పెద్దగా ఆందోళన పడాల్సిన సమస్య కాదు. అందుకే, ఫైబ్రాయిడ్స్ గురించి అంతగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు.
డా॥ ప్రత్యూషారెడ్డి
అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్,
బర్త్‌రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్
ఫోన్: 8882 046 046
www.rainbowhospital.in
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- fibroids
- fibroids lumps
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

