Avocado | గుండె ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు ఈ పండు తప్పక తినాల్సిందే!
గుండెకు అండ.. అవకాడో గుండె ఆరోగ్యం మీద అవకాడో మంచి ప్రభావాలు చూపుతుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. తాజాగా మరొక అధ్యయనమూ ఆ జాబితాలో చేరింది. మిగిలిన వాళ్లతో పోలిస్తే అవకాడో క్రమం తప్పకుండా తినేవాళ్లలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా, చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయట.
గుండెకు అండ.. అవకాడో
గుండె ఆరోగ్యం మీద అవకాడో మంచి ప్రభావాలు చూపుతుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. తాజాగా మరొక అధ్యయనమూ ఆ జాబితాలో చేరింది. మిగిలిన వాళ్లతో పోలిస్తే అవకాడో క్రమం తప్పకుండా తినేవాళ్లలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా, చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయట. అంతేకాదు, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి కూడా వీరిలో తక్కువగా కనిపించిందట. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కోరుకునేవారంతా అవకాడో తప్పక ఆరగించండి.
రిస్ట్‌బ్యాండ్ కడుక్కోండి
ఫ్రెండ్షిప్ డే అనో, పుట్టినరోజు అనో దోస్తులు బహుమతిగా ఇచ్చిన రిస్ట్ట్బ్యాండ్లను ఎంతో అపురూపంగా అందుకుంటాం. ఇష్టంగా చేతికి తొడుక్కుంటాం. రోజుల తరబడి చూసుకుని మురిసిపోతాం. కానీ, వాటిని శుభ్రం చేసుకోవడం గురించి మాత్రం అసలే పట్టించుకోం. కాబట్టే అమెరికా పరిశోధకులు అపరిశుభ్రంగా ఉండే రిస్ట్ బ్యాండ్లు 95 శాతం వరకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వీటిలో కూడా బంగారు, వెండి కంటే ప్లాస్టిక్, రబ్బరు బ్యాండ్ల మీద బ్యాక్టీరియా ఎక్కువగా పోగుపడుతుందట. మురికి రిస్ట్బ్యాండ్లు… స్టెఫలోకోకస్, సూడోమోనాస్, ఎశ్చరీషియా కొలి (ఈ.కొలి) నిలయాలు. వీటి కారణంగా హానికరమైన బ్యాక్టీరియా సంక్రమిస్తుంది. అలా రిస్ట్బ్యాండ్లు రోగ కారకాలవుతాయని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.
లేత మనసు కష్టపెట్టొద్దు
అంత ఆకర్షణీయంగా లేనివారు, క్రీడల్లో పెద్దగా రాణింపులేని కౌమార వయస్కులకు జీవితం కఠినంగానే ఉంటుంది. స్కూల్లో తరచూ శిక్షలు తప్పవు. స్నేహితుల మధ్య కూడా అంత ఆదరణ దొరకదు. ఇదే వాళ్లలో ఏకాకితనానికి దారితీస్తుంది. మనసు అదుపు తప్పుతుంది. దీంతో నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా సమాజం పట్ల ఏహ్యభావాన్ని పెంచుకుంటారు. దాన్ని అధిగమించడానికి వ్యసనాల బాటపడతారు. అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ కౌమార వయస్కుల సామాజిక జీవితం గురించి ఈ సరికొత్త పరిశోధన చేసింది. కాబట్టి, పిల్లల మనసులను కష్టపెట్టకూడదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

