న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో 24 గంటల్లోనే వంట, ఇంటిపనులు, ఆఫీస్ పనులు చక్కబెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, చదువు ఇలా ఎన్నో టాస్క్‌ల మధ్య వ్యాయామానికి సమయం లేదని చాలా మంది చెబుతుంటారు. తీరిక సమయాల్లోనే వర్కవుట్లకు టైం లేదని చెబుతుంటే ఇక ప్రయాణాల్లో వర్కవుట్లను పూర్తిగా వాయిదా వేస్తుంటామని అంటారు.
అయితే ఎన్ని పనులున్నా శారీరక వ్యాయామానికి కొద్ది సమయమైనా కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయమం కీలకమని సూచిస్తున్నారు. కొద్దిపాటి సమయంలోనూ వర్కవుట్లు చేయడం ద్వారా శరీరం, మనసును తేలికపరుచుకోవచ్చని ప్రముఖ సెలబ్రిటి ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ అనుష్క పర్వానీ చెబుతున్నారు. ఈమె కరీనా కపూర్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లకు ఫిట్నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇన్‌స్టా రీల్ వీడియోలో ట్రావెల్ చేస్తూ కూడా ఫిట్‌నెస్‌కు టైం ఎలా కేటాయించవచ్చో ఆమె వివరించారు. అతితక్కువ సమయంలో వర్కవుట్ రొటీన్‌ను ఆమె ఈ వీడియోలో షేర్ చేశారు. వీడియోలో చూపిన విధంగా జంపింగ్ జాక్స్ ఒకట్రెండు నిమిషాల పాటు చేయాలని, ఆపై వెన్నెముక, భుజాన్ని కదిలించే వర్కవుట్ పది సార్లు రిపీట్ చేయడం ఆతర్వాత స్క్వాట్స్ 10 సార్లు, జంప్ స్క్వాట్స్ 10 సార్లు, ఇంచ్ వార్మ్స్ 10 సార్లు రిపీట్ చేయాలని సూచించారు.