Allam Tea | చాయ్‌లో అనేక రకాలు.. వాటిలో అల్లంచాయ్కి ఉన్న ఆదరణే వేరు..!
చాయ్ మంచిదా, కాదా అనే విషయంలో నిత్యం కొత్త పరిశోధనలు వెలుగు చూస్తున్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే.. ఓ గుక్క వేడివేడి టీ ఇచ్చే ఉత్సాహమే వేరు.
Allam Tea | చాయ్ మంచిదా, కాదా అనే విషయంలో నిత్యం కొత్త పరిశోధనలు వెలుగు చూస్తున్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే.. ఓ గుక్క వేడివేడి టీ ఇచ్చే ఉత్సాహమే వేరు. ఉదయం నిద్రమత్తు వదలడం నుంచి.. చిరాగ్గా ఉన్న మెదడును చురుగ్గా మార్చడం వరకు.. చాయ్ ప్రభావాలు అనేకం. అందులోని యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వాదన ఉన్నదే. చాయ్‌లో అనేక రకాలు. ప్రత్యేకించి అల్లంచాయ్కి ఉన్న ఆదరణే వేరు. అందులోని ఔషధగుణాలే దీనికి కారణం.

అజీర్ణానికి చెక్
ఎలాంటి జీర్ణ సమస్యలున్నా, అజీర్తితో కడుపు నొప్పి వచ్చినా, నలుగురిలో ఇబ్బంది పెట్టే తేన్పులు వస్తున్నా… అల్లం టీ ఉత్తమం.
ఉబ్బసంలో ఉపశమనం
కాలుష్యంతో పాటు పెరిగే ఆస్తమాకు శాశ్వత చికిత్స లేదు. కానీ అల్లం వల్ల ఊపిరితిత్తుల వాపు తగ్గి, శ్వాస తేలికపడుతుంది.
గుండె పదిలం
అల్లంలోని విటమిన్-సి, అమైనో యాసిడ్స్ లాంటి పోషకాల వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండె సమస్యలను దరిచేరనివ్వదు.
వాపును అరికట్టి
కీళ్లు, కండరాలలో వచ్చే వాపుల వల్ల అథ్లెట్స్ ఫీట్, మోకాలి నొప్పులు లాంటి సమస్యలు దాడిచేస్తాయి. ఈ వాపును అరికట్టే సుగుణం అల్లం టీకి ఉంది.
వికారానికి మందు
ప్రయాణంలోనో, తలనొప్పితోనో కలిగే వికారాలకు అల్లం టీ మంచి మందు అని అనుభవపూర్వకంగా చెప్పేస్తున్నారు చాలామంది.
రుతుస్రావ ఇబ్బందులు
రుతుస్రావ సమయంలో వచ్చే కండరాల సమస్యలు, పొత్తికడుపు నొప్పి నుంచి అల్లం టీ ఊరటనిస్తుంది. అంతేకాదు. అల్లం టీతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని.. సంతానలేమి పరిష్కారానికి ఉపయోగపడుతుందనీ వైద్యులు చెబుతారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

