Health Tips | ఆడవాళ్లు మెంతులు తింటే ఎన్ని లాభాలో తెలుసా!
Health Tips | భారతీయ వంటకాల్లో మెంతుల స్థానం కీలకం. చేదుగానే ఉన్నా, ఓ నాలుగు మెంతులు జోడిస్తే ఏ ఆహారమైనా రుచి అదిరిపోవాల్సిందే. ఇక మెంతికూర గురించి చెప్పేదేముంది? చపాతీ నుంచి పప్పు వరకు.. మెంతికూరను చేరిస్తే రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా ఢోకా ఉండదు.
Health Tips | భారతీయ వంటకాల్లో మెంతుల స్థానం కీలకం. చేదుగానే ఉన్నా, ఓ నాలుగు మెంతులు జోడిస్తే ఏ ఆహారమైనా రుచి అదిరిపోవాల్సిందే. ఇక మెంతికూర గురించి చెప్పేదేముంది? చపాతీ నుంచి పప్పు వరకు.. మెంతికూరను చేరిస్తే రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా ఢోకా ఉండదు. మెంతికి సంబంధించి కొన్ని విషయాలు..
➢ ఒంట్లోని చెడు కొవ్వును కరిగించే లక్షణం మెంతులకు ఉందని చెబుతారు. ఊబకాయాన్ని తగ్గించుకోవాలని అనుకునేవారు, ఆహారంలో మెంతులు లేదా మెంతికూర చేర్చుకోవచ్చు.
➢ జీర్ణ సంబంధమైన సమస్యలకు మెంతులు దివ్యౌషధం. జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా ఆహారంలోని పోషకాలు కూడా ఒంటికి అందుతాయి.
➢ రుతుక్రమంలో మహిళలకు వచ్చే కండరాల నొప్పులను తగ్గించడంలో మెంతులు సాయపడతాయి. ఐరన్ లోపాన్ని సరిదిద్దేందుకు కూడా ఉపయోగపడతాయి.
➢ మెంతులకు ఆకలిని తగ్గించే గుణం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినేవారు నోరు కట్టేసుకోడానికి సాయపడుతాయి.
➢ నీళ్లలో నానబెట్టిన మెంతులతో మధుమేహం అదుపులో ఉంటుందనే విషయం ప్రచారంలో ఉంది. దీనికి శాస్త్రీయ రుజువులూ ఉన్నాయి.
➢ మెంతులు లేదా మెంతికూరలో పొటాషియం లాంటి పోషకాలు, విటమిన్స్, ప్రొటీన్స్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, తప్పనిసరిగా వంటకాల్లో చేర్చుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

