Health Tips : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాహారం విధిగా తీసుకోవాలి. ఇక భావోద్వేగాలు, నిద్ర, వర్కవుట్ల సామర్ధ్యం, షుగర్ నియంత్రణ కోసం అత్యవసర పోషకం మెగ్నీషియం కీలకం. మన రోజువారీ ఆహారంలో మెగ్నీషియం పలు పదార్ధాల్లో లభిస్తుంది.
పాలకూర, వేరుశనగలు, రాగి వంటి ఎన్నో ఆహార పదార్ధాల్లో మెగ్నీషియం ఉంటుంది. వీటితో రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూనే శరీరానికి అవసరమైన ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇక మెగ్నీషియం అధికంగా ఉండే పాలకూర పప్పును తరచూ తీసుకోవచ్చు.
యూఎస్డీఏ గణాంకాల ప్రకారం 100 గ్రాముల పాలకూరలో 79ఎంజీ మెగ్నీషియం ఉంటుంది. దీన్ని పెసర పప్పుతో కలిపి తీసుకుంటే రుచిగా ఉండటమే కాకుండా మెగ్నీషియం అధికంగా శరీరానికి లభిస్తుంది. ఇక మెగ్నీషియం అధికంగా ఉండే ఐదు భారతీయ రెసిపీలను పరిశీలిస్తే..
పాలకూర పప్పు
శనగల కూర
బ్రౌన్రైస్ పలావ్
మిల్లెట్ ఉప్మా
గుమ్మడి సబ్జి
Read More :
Watch: షాపింగ్ మాల్లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి.. పసి బాలుడు మృతి