Child nutrition Deficiency | బాల్యాన్ని భయపెడుతున్న పౌష్టికాహార లోపం.. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Child nutrition Deficiency | శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తదితరాలు సమపాళ్లలో అందకపోవడం వల్ల పోషక విలువల కొరత తలెత్తుతుంది. ఈ సమస్య ఐదేండ్లలోపు బాలబాలికల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
Child nutrition Deficiency | బిడ్డ ఎదుగుదలలో పోషక విలువలే కీలకం. ఒకవేళ ఆహారంలో పోషకాలు లోపిస్తే పసిపిల్లల బోసినవ్వులు ఉండవు. బుడిబుడి అడుగులు పడవు. కేరింతల ముచ్చటే కనిపించదు. ఎప్పుడూ ఏడుపే. నిత్యం అనారోగ్యమే. బక్కచిక్కిపోయి బిక్కుబిక్కుమంటున్న ఆ బిడ్డలో ముదిమి లక్షణాలు కనిపిస్తాయి. ఆ దుష్ప్రభావం పసితనాన్ని చిదిమేస్తుంది. చిరుదీపాన్ని ఆర్పేస్తుంది. ఆ గండాన్ని గట్టెక్కడానికి బలవర్ధకమైన ఆహారమే అండ. పసినలుసు పొట్టన పడకముందు నుంచీ తల్లి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అవసరమైతే పోషకాహార నిపుణులనూ సంప్రదించాలి.
పౌష్టికాహార లోపం బాల్యాన్ని భయపెడుతున్నది. బిడ్డ తన గర్భంలో ఉన్నప్పుడు.. తల్లి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం, అప్పటికే ఆమె వివిధ అరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం.. తదితర కారణాల వల్ల పుట్టుకతోనే పసిబిడ్డలలో పోషక విలువల లోపం ఏర్పడుతున్నది.
ఆ లోపాలు
శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తదితరాలు సమపాళ్లలో అందకపోవడం వల్ల పోషక విలువల కొరత తలెత్తుతుంది. ఈ సమస్య ఐదేండ్లలోపు బాలబాలికల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పిల్లలు వయసుకు తగినంత బరువు పెరగరు. శారీరక ఎదుగుదల మందగిస్తుంది. తరచూ అనారోగ్యాల పాలవుతారు. ఈ పరిస్థితిని తీవ్రమైన పోషక విలువల లోపంగా భావించాల్సి ఉంటుంది.

బిడ్డ కడుపులో ఉన్నప్పుడు
గర్భం దాల్చాలనుకునే మహిళ ముందు నుంచే పోషక విలువల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పౌష్టికాహార లోపంతోనే గర్భం ధరించడం, ఆ తరువాత కూడా సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల బిడ్డ లోపాలతో జన్మిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. తొలినుంచీ మంచి ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. దీనివల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. సుఖ ప్రసవం జరుగుతుంది. ఇద్దరూ క్షేమంగా ఉంటారు. కానీ, పోషక విలువల కొరతతో జన్మిస్తే మాత్రం బిడ్డకు ఎన్నో అనర్థాలు..
- మిగతా పిల్లల్లా ఉత్సాహంగా ఆడుకోరు.
- తరచూ ఏడుస్తుంటారు. తల్లిదండ్రుల చంక దిగరు.
- మెదడు ఎదుగుదల లోపించడం వల్ల వయసుకు తగినట్టు నడుచుకోరు.
- తరచూ ఇన్ఫెక్షన్స్కు గురవుతారు.
- విటమిన్ లోపాలు ఏర్పడతాయి
- న్యుమోనియా వంటి సమస్యలు వెంటాడతాయి.
- యూరిన్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి
- విటమిన్-ఎ పడిపోతుంది. దీనివల్ల అంధత్వ సమస్య రావచ్చు.
- చిన్నచిన్న రుగ్మతలు కూడా తీవ్రంగా మారిపోతాయి.
- ఎముకలు పెళుసుబారి ఉంటాయి. దీంతో చిన్న ప్రమాదం జరిగినా ఇట్టే విరిగిపోతాయి. జట్టు కూడా నిస్తేజంగా ఉంటుంది.
చికిత్స తప్పనిసరి
సాధారణంగా ఓ మోస్తరు పోషక విలువల లోపంతో బాధపడే పిల్లలకు ఇంట్లోనే సరైన పౌష్టికాహారం అందిస్తే సరిపోతుంది. కానీ, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు చికిత్స తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి పిల్లల్లో తరచూ ఇన్ఫెక్షన్స్, జబ్బులు వస్తుంటాయి. కాబట్టి, తక్షణ వైద్యం అవసరం. ప్రత్యేకమైన ఆహారం కూడా అందించాల్సి ఉంటుంది. రోగి ఆరోగ్య స్థితి, వయసు ఆధారంగా.. తగినంత బరువు పెరిగే వరకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రత్యేక ఫార్ములా
ఇలాంటి సందర్భాల్లో.. శిశువు బరువు, ఆరోగ్య స్థితి ఆధారంగా నిపుణులు ప్రత్యేకమైన డైట్ సిఫారసు చేస్తారు. అందుకోసం ఓ ఆహార ప్రణాళికనూ రూపొందిస్తారు. దీంతో శిశువులోని పోషక విలువల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. 0-6 నెలల్లోపు పిల్లలకు ఫార్ములా ఎఫ్-75, ఫార్ములా ఎఫ్-100డి, ఎఫ్-100 డైట్ ఇస్తారు. 6 నెలల నుంచి 5 ఏండ్ల పిల్లలకు ఆరురకాల సాఫ్ట్ డైట్స్ ఇస్తారు. ఫార్ములా ఎఫ్-75లో పాలు, నూనె, చక్కెర తదితర పదార్థాలను తక్కువగా ఉపయోగించి ఆహారం తయారు చేస్తారు. ఈ రకమైన డైట్‌ను శిశువులకు మొదటి రెండు రోజులు ఇస్తారు. ఆ తరువాత ఫార్ములా ఎఫ్-100డి, ఎఫ్-100లను దశలవారీగా ఇస్తారు. 6 నెలల నుంచి 5 ఏండ్ల పిల్లలకు ఆరు రకాల సాఫ్ట్ డైట్స్ ఇస్తారు. ఆయా పోషకాల లోపాలను బేరీజు వేసి.. విటమిన్స్, మినరల్స్‌తో పాటు ఇతర సప్లిమెంట్స్ అందిస్తారు.
సాఫ్ట్ మెనూ
- ఆకుకూరలు
- చపాతీలు
- కిచిడీ
- హల్వా
- పాలు
- గుడ్లు
- తాజా పండ్లు
పిల్లలతో పాటు తల్లులకూ
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకని పిల్లలకు ప్రత్యేక డైట్ ఇస్తున్న సమయంలోనే.. వారి తల్లులకు సైతం పౌష్టికాహారం అందించాలి. ఫలితంగా బిడ్డకు పట్టించే పాలు బలవర్ధకంగా ఉంటాయి. చనుబాలలోని అమృత గుణాల వల్ల శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారు. పోషక విలువల లోపం ఉన్నా.. త్వరగా కోలుకుంటారు. శిశువు పూర్తిగా కోలుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యేవరకు జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహార విధానాన్ని వారసత్వంగా పిల్లలకు అందించాలి. ఇదే ఓ పెద్ద ఆస్తి.
– డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్ నిలోఫర్ పిల్లల దవాఖాన హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

