అటు అత్త.. ఇటు భర్త!
అమ్మానాన్నల మీద గౌరవంతో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. కొత్తలో బాగానే ఉండేది. ప్రేమించే భర్త, ఆదరించే అత్తామామలు, అభిమానాన్ని కురిపించే బంధువులు.. ఓ కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన భావన కలిగేది. ఆరు నెలల్లో ఆ భ్రమలన్నీ బద్దలైపోయాయి. వంట పనులు చేస్తేనేమో భర్తకు కోపం వస్తుంది.
అమ్మానాన్నల మీద గౌరవంతో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. కొత్తలో బాగానే ఉండేది. ప్రేమించే భర్త, ఆదరించే అత్తామామలు, అభిమానాన్ని కురిపించే బంధువులు.. ఓ కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన భావన కలిగేది. ఆరు నెలల్లో ఆ భ్రమలన్నీ బద్దలైపోయాయి. వంట పనులు చేస్తేనేమో భర్తకు కోపం వస్తుంది. ‘ఇంట్లో ఉన్న కొద్దిసేపైనా నాతో ఉండొచ్చు కదా’ అంటారు. మేం తలుపులు బిగించుకుని కూర్చుంటేనేమో అత్తగారి గొణుగుడు మొదలవుతుంది. ‘వంట పనీ, ఇంటి పనీ నేనొక్కదాన్నే చేసుకోవాలా?’ అని కోప్పడతారు. మధ్యలో ఆఫీసు ఫోన్లు, ప్రాజెక్ట్‌లు. చాలా ఒత్తిడిగా అనిపిస్తున్నది. అలా అని ఉద్యోగం వదిలిపెట్టలేను. అత్తగారిని ఎదిరించలేను. భర్తను బాధపెట్టలేను. నా సమస్యకు మీరే పరిష్కారం చెప్పాలి.
- ఓ సోదరి
మీ పరిస్థితి అర్థమైంది. నిజమే, ప్రతి ఆధునిక మహిళా ఎదుర్కొంటున్న సమస్యే ఇది. భర్తకు భార్యగా, ఇంటికి ఇల్లాలిగా, ఉద్యోగంలో ప్రొఫెషనల్‌గా.. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిందే. ప్రతి నిమిషం మీకు విలువైందే. దాన్నే మూడు భాగాలు చేసుకోవాలి. అన్నిటికంటే ముందు.. మీ అత్తగారికి, భర్తకు మీ పరిస్థితి వివరించండి. వాళ్లనే పరిష్కారం చెప్పమని అడగండి. ఎటూ సంపాదిస్తున్నారు కాబట్టి, వీలైతే వంట మనిషిని, పని మనిషిని పెట్టుకోండి. మీరు మాత్రమే చేయాల్సిన పనుల్ని భుజానికి వేసుకోండి. ఆఫీసుకు వెళ్లిన తర్వాత కూడా.. లంచ్ టైమ్‌లోనో, కాఫీ టైమ్‌లోనో భర్తతో చాట్ చేయండి. తనకు నచ్చిన విషయాలకు సంబంధించి సోషల్ మీడియా పోస్ట్‌లు ఫార్వర్డ్ చేయండి. తరచూ తను ఇష్టంగా తినే రుచులను ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.
‘ప్రత్యక్షంగా నీ సమక్షంలో లేకపోయినా.. నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతుంటాయి సుమా!’ అని గుర్తుచేయడానికే ఇదంతా. వీకెండ్స్‌లో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లండి. మంచి రిసార్ట్‌లో సేదతీరండి. మీరు తనను విస్మరిస్తున్నారనే భావనను దూరం చేయండి. నిజమే, ఇవన్నీ చెప్పినంత సులభం కాదు. అలా అని అసాధ్యమూ కాదు.. అందులోనూ పెద్ద చదువులు చదువుకొని, బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్న మీలాంటి ఆధునిక మహిళకు!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

