పాపకు దగ్గూ ఆయాసం!
మా పాప వయసు తొమ్మిది నెలలు. తరచూ దగ్గుతుంది. ఆయాస పడుతుంది. డాక్టరుకు చూపిస్తే ‘బ్రాంకియోలైటిస్' అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, లక్షణాలేమిటి? - ఓ సోదరి
మా పాప వయసు తొమ్మిది నెలలు. తరచూ దగ్గుతుంది. ఆయాస పడుతుంది. డాక్టరుకు చూపిస్తే ‘బ్రాంకియోలైటిస్’ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, లక్షణాలేమిటి?
– ఓ సోదరి
ముక్కు నుంచి గొంతు, ట్రెకియాకు చేరిన గాలిని ఊపిరితిత్తులకు చేరవేసే సన్నని శ్వాసనాళాలను ‘బ్రాంకియోల్స్’ అంటారు. ఈ శ్వాసనాళాలకు వచ్చే అంటువ్యాధిని ‘బ్రాంకియోలైటిస్’ అంటారు. ఇది చిన్నపిల్లల్లో సర్వసాధారణమైన శ్వాసకోశ వ్యాధి. రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, ఇన్ఫ్లూయంజా, పారా ఇన్ఫ్లూయంజా, ఎడినో వైరస్, రైనో వైరస్ అనే సూక్ష్మజీవులు ప్రధాన కారణాలు. ఇది వర్షాకాలం, చలికాలంలో కనిపిస్తుంది. బ్రాంకియోలైటిస్ రెండేండ్ల లోపు పిల్లలకు వచ్చే అవకాశం ఉన్నా.. 80 శాతం మరణాలు ఆరు నెలలలోపు పిల్లల్లోనే సంభవిస్తాయి.
డే కేర్ సెంటర్లలో ఉండే పిల్లలు, ధూమపానం అధికంగా జరిగే పరిసరాల్లో నివసించేవారు, కిక్కిరిసిన నివాసాలలో జీవించేవారు, నెలలు నిండకముందే జన్మించిన శిశువులు, జన్మతః గుండె జబ్బులున్నవారు, పోషకాహార లోపాలతో బాధపడేవారికి కనుక ఈ వ్యాధి వస్తే ఇట్టే తీవ్రస్థాయికి చేరుకుంటుంది. తొలుత జలుబు, జ్వరంతో ప్రారంభమై దగ్గు, ఆయాసంలోకి దించుతుంది. దీనివల్ల బిడ్డలు పాలు తాగటం కష్టం అవుతుంది. శ్వాస తీసుకుంటున్న శబ్దం బయటికి వినిపించవచ్చు. వ్యాధి తీవ్రమైనప్పుడు శ్వాస ఆగిపోవచ్చు. శరీరంలో ఆక్సిజన్ పరిమాణం అకస్మాత్తుగా పడిపోవచ్చు. దీనివల్ల పిల్లలు మరణించే ప్రమాదం ఉంది.
ఇది దగ్గు, తుమ్ము, లాలాజల బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ ముక్కు తరచూ శుభ్రం చేస్తూ తగినన్ని ద్రవ పదార్థాలు ఇవ్వాలి. తల, ఛాతీ భాగం 30 డిగ్రీలు ఏటవాలుగా ఉండేలా కూర్చోబెడితే.. గాలి పీల్చడం సులభం అవుతుంది. శ్వాసక్రియ వేగం పెరగటం, శరీరం నీలం రంగులోకి మారడం ప్రమాద చిహ్నాలు. వ్యాధి ప్రారంభమైన 48-72 గంటల లోపు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 10-12 రోజుల తరువాత రుగ్మత లక్షణాలు తగ్గటం ఆరంభమవుతుంది. ఈ వ్యాధి బారినపడ్డ శిశువులకు భవిష్యత్తులో ఉబ్బసం రావచ్చు.
డాక్టర్ కర్రా రమేశ్ రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు, సికింద్రాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

