Health Tips | ఈ ఐదు సహజ పద్ధతులు పాటిస్తే పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి!
పులిపుర్లు అనేవి హ్యుమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల ఏర్పడతాయి. ఇవి వైరస్ ఇన్ఫెక్షన్లు. పులిపిర్లు ఓ అంటువ్యాధి. శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు వ్యాపిస్తాయి. పులిపిర్లలో వివిధ రకాలున్నాయి. చేతులపై వచ్చేవి సాధారణ పులిపిర్లు. అరికాళ్లపై వచ్చే వాటిని ప్లాంటార్ పులిపిర్లు అని పిలుస్తారు. ఫ్లాట్ పులిపుర్లు శరీరంపై ఎక్కడైనా కనిపించవచ్చు. కళ్లు, పెదవుల చుట్టూ కనిపించేవాటిని ఫిలిఫార్మ్ పులిపిర్లు అని పిలుస్తారు. వీటిని అనవసరంగా తాకకూడదు. ఐదు రకాల సహజ పద్ధతుల్లో వీటిని తొలగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

1.టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్‌ను పులిపిర్లపై అప్లై చేసి, కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. టీ ట్రీ ఆయిల్లో కొన్ని చుక్కల కాస్టర్ ఆయిల్ కలపాలి. వాటిని పులిపిర్ల మీద కాటన్ బాల్‌తో అప్లై చేయాలి. ప్రతిరోజూ రెండు, మూడు సార్లు ఇలా చేస్తూ ఉండాలి. దీంతో కొద్దిరోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి.
2. విటమిన్ ఈ మాత్రలు..
ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని పులిపిర్లపై అప్లై చేయాలి. అనంతరం దానిపై బ్యాండేజీ వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. కనీసం రెండు వారాలపాటు ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
3. ఆముదం..
ఆముదం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పులిపిర్లపై ప్రతిరోజూ రెండుసార్లు ఆముదాన్ని అప్లై చేయాలి. ఇలా సుమారు రెండు వారాలపాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
4. ఆపిల్ సైడర్ వెనిగర్..
ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక పాపులర్ హోం రెమెడీ. పులిపిర్లను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక భాగం నీటిలో రెండు చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్‌ను నానబెట్టి 15 నిమిషాలపాటు అప్లై చేస్తూనే ఉండాలి. ఇలా రెండువారాలు చేస్తే పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి.
5. అలోవెరా..
తాజా కలబంద గుజ్జును తీసుకోవాలి. ప్రతిరోజూ ఆ జెల్‌ను పులిపిర్లపై అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే కొన్నిరోజులకే మంచి ఫలితం కనిపిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!