HomeGalleryRain Garden On Begumpet Nala Beautification
Hyderabad | తీరొక్క అందాలతో మురిసిపోతున్న మూసీ
Rain Garden On Begumpet Nala Beautification (1)
2/10
మూసీ రివర్ ఫ్రంట్ పేరిట ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీ నదిని అందంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
3/10
మూసీ సుందరీకరణలో భాగంగా ఫతేనగర్ మురుగు నీటి శుద్ధి కేంద్రం నుంచి బేగంపేట రెయిన్ గార్డెన్ వరకు 1.9 కిలోమీటర్ల మేర వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
4/10
ఈ మేరకు డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహ్వానించారు.
శిల్పాలు, ఓపెన్ థియేటర్, వాటర్ ఫ్రంట్ ఫ్లోటింగ్ డక్‌లు, ఫుడ్ కోర్టులు తదితర ఏర్పాటుతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.
7/10
అంతే కాకుండా, నగర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారు.
8/10
త్వరలోనే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటి తో పాటు ప్రధానంగా మంచిరేవుల నుంచి గౌరెల్లి వరకు మూసీ పొడవునా 55 కిలోమీటర్ల మేరలో రూ.10 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
9/10
ఇదే సమయంలో జీడిమెట్ల నుంచి హుస్సేన్‌సాగర్ తీరం వరకు ఉన్న కూకట్‌పల్లి నాలా వెంబడి కొత్త అందాలను పరిచయం చేయాలని నిర్ణయించారు.
10/10
మూసీ సుందరీకరణలో ఈ నాలా వెంబడి బేగంపేట వద్ద రెయిన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.