బుధవారం 03 మార్చి 2021
Gadwal - Jan 17, 2021 , 00:50:20

కరోనాను తుదముట్టిద్దాం

కరోనాను తుదముట్టిద్దాం

  • ఎమ్మెల్యే అబ్రహం

ఇటిక్యాల, జనవరి 16 : ఐకమత్యంతో కరోనాను తుదముట్టిద్దామని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. శనివారం ఇటిక్యాల పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌ శృతి ఓఝాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవాళికి ముప్పుగా మారిన కరోనాను పారదోలేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి టీకాను కనిపెట్టారన్నారు. అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. కలెక్టర్‌ శృతి మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఒక్కోచోట 30 మందికి టీకా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 8 మంది ఏఎన్‌ఎం, ముగ్గురు హెల్త్‌ అసిస్టెంట్లు, 19 మంది ఆశ కార్యకర్తలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి సౌజన్య, ఎంపీపీ స్నేహ, జెడ్పీటీసీ హన్మంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాందేవ్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ రంగారెడ్డి, తాసిల్దార్‌ శివలిగం, ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి, వైద్యులు మాలకొండయ్య, సురేశ్‌, సర్పంచులు సరోజమ్మ, ఈదన్న, గోవర్దన్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo