సోమవారం 30 మార్చి 2020
Gadwal - Jan 12, 2020 , 02:12:12

కొత్త ఓటర్ల వివరాలు నమోదు చేయండి

కొత్త ఓటర్ల వివరాలు నమోదు చేయండి
  • -పోలింగ్‌ స్టేషన్ల తనిఖీలో జేసీ నిరంజన్‌మల్దకల్‌ : మండల కేంద్రంలోని పోలింగ్‌ స్టేషన్లను శనివారం జాయింట్‌ కలెక్టర్‌ నిరంజన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మల్దకల్‌లోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కార్యక్రమం కొనసాగాలని తాసిల్దార్‌ అజాంఅలీని ఆదేశించారు. గ్రామంలోని కొత్త ఓటర్లు ఎవరైనా వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ స్టేషన్లలో బీఎల్‌వోలు ఉంటారని కొత్త వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జేసీ వెంట తాసిల్దార్‌ అజాంఅలీ, వీఆర్‌వో తిరుమలేశ్‌ తదితరులు ఉన్నారు.


logo