రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘రావణాసుర’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నటుడు చిరంజీవి క్లాప్‌నివ్వగా, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా పోస్టర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్రను పోషిస్తుండగా..అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్, నితిన్ మోహతా, సత్య, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, ఎడిటర్: శ్రీకాంత్, ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కె కిరణ్, సీఈఓ: పోతిని వాసు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, దర్శకత్వం: సుధీర్‌వర్మ.