‘తొలి సినిమాతోనే కథానాయకుడిగా ప్రేక్షకుల మెప్పును పొందడం ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వులను పంచే ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ఇదని సినిమా చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు’ అని అన్నారు అశోక్ గల్లా. ఆయన కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘విడుదలైన ప్రతి చోట సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తున్నది. సంక్రాంతికి పెద్ద విజయం దక్కింది’ అన్నారు. ‘ప్రతి సన్నివేశం నవ్వుల్ని పంచుతున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి’ అని నిర్మాత గల్లా పద్మావతి చెప్పింది.