దౌత్య వైపరీత్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ మధ్య శ్వేతసౌధం సాక్షిగా జరిగిన తగాదా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 1971, అక్టోబర్‌లో అప్పటి పాక్ సైనిక ప్రభుత్వం, తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో జరుపుతున్న నరమేధంపై నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్, భారత ప్రధాని ఇందిరాగాంధీకి మధ్య తీవ్రస్థాయిలో జరిగిన చర్చను ఇది గుర్తు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ మధ్య శ్వేతసౌధం సాక్షిగా జరిగిన తగాదా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 1971, అక్టోబర్‌లో అప్పటి పాక్ సైనిక ప్రభుత్వం, తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో జరుపుతున్న నరమేధంపై నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్, భారత ప్రధాని ఇందిరాగాంధీకి మధ్య తీవ్రస్థాయిలో జరిగిన చర్చను ఇది గుర్తు చేసింది. ఎవరు దురాక్రమణకు దిగారు, ఎవరు బాధితులనేది అప్పటి అమెరికా అధ్యక్షుడైన నిక్సన్ పట్టించుకోలేదు. ఇప్పటి అధ్యక్షుడు ట్రంప్ కూడా పట్టించుకోవడం లేదు.
స్పష్టంగా చెప్పాలంటే అమెరికాకు ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అంటుంది మార్క్సిజం. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఉన్న సంబంధాలు అలాంటివే. ట్రంప్ వృత్తిపరమైన రాజకీయవేత్త కాదు, ఆయన ఓ వ్యాపారి. ఏదైనా పని తలపెట్టాలంటే దానివల్ల కలిగే లబ్ధి ఏమిటనేది చూడటం వ్యాపార లక్షణం. ఇక్కడ శాంతి పేరిట ఒక ఒడంబడిక లాంటిది ట్రంప్ సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తున్నది.
అది పూర్తిగా రష్యాకు అనుకూలంగా, ఉక్రెయిన్‌కు, తద్వారా నాటో దేశాలకు భద్రతా పరంగా వ్యతిరేకంగా ఉందనేది బహిరంగ రహస్యమే. కానీ, ట్రంప్ అవేవీ పట్టించుకోవడం లేదు. అమెరికా అందించిన సాయం పూర్తిగా నిరర్ధకమైపోయినట్టుగా ఆయన వాపోతున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయమే అందించింది. అదీ, రష్యాతో యుద్ధం చేసేందుకు. అందుకు సరైన కృతజ్ఞత ఉక్రెయిన్ నుంచి రావడం లేదనేది ట్రంప్ ఫిర్యాదు. ఆ కృతజ్ఞతా భావం ఏ రూపంలో రావాలని ట్రంప్ ఆశిస్తున్నారనేది ఆలోచిస్తే అసలు సంగతి అర్థమవుతుంది.
ఉక్రెయిన్‌లో ఉన్న ఖనిజ సంపదను, మరీ ముఖ్యంగా అధునిక సాంకేతికతకు కీలక వనరైన లిథియం గనులను అమెరికాకు అప్పగించాలనేది ట్రంప్ పంతం. అంటే, అమెరికా చేసిన సాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్ తన సహజ సంపదలను తమకు ధారాదత్తం చేయాలనడం ఒక రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ధోరణిని తలపిస్తున్నది. మరీ ఇంత బహిరంగంగా, మీడియా సమక్షంలో జరిగిన చర్చలో ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ డిమాండ్లను ముందుకుతేవడం కొంచెం విచిత్రంగానే అనిపిస్తున్నప్పటికీ, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్ ఆలోచిస్తున్నది అదే.
మీడియా సమావేశంలో జరిగిన సంవాదంలో ట్రంప్ డిమాండ్లను జెలెన్స్కీ నిరాకరించడం సబబే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంత గడుసైన రీతిలో వ్యవహరిస్తున్నప్పుడు దానికి తాను బహిరంగంగా తలొగ్గినట్టు కనిపించడం ఏ అధ్యక్షుడికీ ఇష్టం ఉండదు. అలాంటి చర్య ఉక్రెయిన్‌లో జెలన్స్కీ పరపతిని పూర్తిగా ధ్వంసం చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. ఈ వాగ్యుద్ధం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడిని, ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందాన్ని అవమానకరమైన రీతిలో బయటకు పంపించి వేశారనే వార్త మరింత విస్మయం కలిగిస్తున్నది.
యుద్ధ సాయం విషయంలో అమెరికా వెనక్కి తగ్గడం వల్ల అటు ‘నాటో’లోనూ లుకలుకలు బయలుదేరాయి. ట్రంప్ మొదటి నుంచీ నాటోకు వ్యతిరేకమే. నాటోలాంటి గుదిబండలు అమెరికాకు అవసరం లేదన్నది ట్రంప్ ఆలోచన. ట్రంప్ ధోరణి పట్ల మొదట్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, ఉక్రెయిన్ విషయంలో ముందుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై నాటో దేశాల్లోనూ తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా చేసిన సాయానికి కృతజ్ఞతగా ఉంటామని జెలెన్స్కీ చేసిన తాజా ప్రకటనను నిస్సహాయస్థితిలో వ్యక్తమైన అనివార్యతగా భావించాలి. వైట్‌హౌస్‌లో ఒప్పుకోనప్పటికీ, మరో రకంగా అమెరికా ముందు ఉక్రెయిన్ మోకరిల్లక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అన్నది నిజానికి దగ్గరగా ఉన్న అనుమానం. అయితే, అమెరికా ఇలా బాహాటంగా తనకు ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని తెగింపు చూపడం ప్రపంచ దేశాలను సమస్యల నుంచి బయటపడేయడం మాటేమో గానీ మరింతగా సంక్షోభంలోకి కూరుకుపోయేలా చేసే అవకాశం ఉంది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

