మారుతున్న రాజకీయ ముఖచిత్రం
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దేశమంతా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా? అని ఆసక్తి చూపించింది . తీరా ఫలితాలు వచ్చాక తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దేశమంతా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా? అని ఆసక్తి చూపించింది . తీరా ఫలితాలు వచ్చాక తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ప్రచారంలో ఊగిపోవడాలు లేవు, గర్జనలూ లేవు. ఎన్నికల ముందు కుటుంబ వివాదాలను రాజకీయం చేసినా తమిళ నటుడు విజయ్ అవేమీ పట్టించుకోకుండా తనకు అవకాశమిస్తే ఏంచేస్తానో బలంగా చెప్పి ప్రజల విశ్వాసాన్ని పొందారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి, వామపక్షాలకు కాలం చెల్లిందని స్పష్టమైంది.
కేరళలో వామపక్ష కూటమి ఓటమితో దేశ రాజకీయాల్లో వామపక్ష శకం ముగిసినట్టు అయింది. అక్కడో సీటు ఇక్కడో సీటు గెలిచినా వామపక్షాల శకం ముగిసినట్టే. జ్యోతిబసు కాలంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే స్థాయికి చేరుకున్న వామపక్షాలు ఇప్పుడు దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేవు. వచ్చే అవకాశాలూ లేవు. కాలం మారిందని గ్రహించలేక వామపక్షాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల తరబడి పాతుకుపోయిన కమ్యూనిస్టులను తృణమూల్ కాంగ్రెస్ మట్టికరిపిస్తే..ఈ పార్టీ మూడుసార్లు అధికారంలో ఉండటం వల్ల సహజంగా ఏర్పడే వ్యతిరేకతతో పాటు బీజేపీ హిందుత్వ ప్రభావం ఎన్నికల్లో చూపించింది. బెంగాల్లో పార్టీ క్లబ్‌లు ఉంటాయి. ఇల్లు కట్టాలన్నా, ఇంట్లో భార్యాభర్తల ‘పంచాయితీ’ అయినా ఈ క్లబ్‌లు జోక్యం చేసుకుంటాయి. స్థానికంగా వీరే ప్ర భుతం. కమ్యూనిస్టులు పోయి తృణమూల్ కాంగ్రెస్ వచ్చాక క్లబ్ మీద జెం డా మారింది తప్ప..మనుషులు, వారి దౌర్జన్యాల్లో మార్పు లేదని అక్కడి రాజకీయాల గురించి తెలిసినవారి మాట.
తమిళనాడు, బెంగాల్, ఆస్సాం, పాండిచ్చేరి రాష్ర్టాల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కేరళలో కాంగ్రెస్ ఎనిమిది పార్టీల కూటమితో పోటీ చేసి విజయాన్ని దక్కించుకున్నది. ఇదేమీ కాంగ్రెస్ సొంత విజయం కాదు. వామపక్షాల దారిలో కాంగ్రెస్ సైతం కనుమరుగు కాబోతున్న పార్టీ అని ఐదు రాష్ర్టాల ఫలితాలు చాటిచెప్పాయి. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్.. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్‌కు మిగిలినవి మూడు రాష్ర్టాలే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ మూ డు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారం వదులుకునే అవకాశాలే ఎక్కువ. తెలంగాణ, కర్ణాటకల్లో అధికారాన్ని కోల్పోవటానికి ఎంతో దూరం లేదు.
తమిళనాడులో దాదాపు ప్రతి నటుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. వారిలో అంత చిత్తశుద్ధి లేదు. సినీ దేవుడిగా పూజలందుకునే రజనీకాంత్ సైతం రాజకీయ పార్టీ నడుపలేక చేతులెత్తేశారు. సినిమా గ్లామర్‌ను క్యాష్ చేసుకోవాలనే అత్యాశ తప్ప ప్రజలకు ఏదో చేయాలని కాదు. తెలుగులో చిరంజీవి ఎలాగో.. తమిళనాడులో విజయ్‌కాంత్ అలా చిత్తశుద్ధి లేక పార్టీ పెట్టి సోదిలోకి లేకుండా పో యారు. రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి వారు సీరియస్ రాజకీయాలకు పనికిరారు. విజయ్ మాత్రం అలా కాకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనంలో నిలిచారు. కేవలం సినిమా గ్లామర్ వల్లనే ఆయన విజయం సా ధించారంటే విజయ్ కన్నా ఎక్కువ సినిమా గ్లామర్ ఉన్న రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్‌కాంత్ నిలువలేకపోయారు కదా?
విజయ్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి 50 ఏండ్ల వయసులో సినిమాలకు స్వస్తి పలికి పూర్తికాలం రాజకీయాల్లో ఉంటానని చేసిన ప్రకటనను ప్రజలు బలంగా నమ్మారు. ‘నువ్వు లేకపోతే నేను’ అని డీఎంకే, ఏఐఏడీఎంకే అధికారాన్ని చెరి ఐదేండ్లు పంచుకుంటూ వచ్చాయి. వారి గుత్తాధిపత్యానికి విజయ్ గండికొట్టారు. ఇప్పుడు విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటే ఆ పార్టీ ముద్ర పడుతుంది. ‘సచివాలయంలో లంకెబిందెలు ఉన్నాయనుకొని హామీలు ఇచ్చాం.. బిందెలు లేవు’ అనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తరహాలో విజయ్ తప్పించుకోలేరు.
విజయ్ వయసు 52 ఏండ్లు. ఎన్టీఆర్, చిరంజీవిలా హీరోగా వయసు అయిపోయిన తరువాత ఆయన పార్టీ పెట్టలేదు. హీరోగా కనీసం ఇంకో దశాబ్దం అవకాశం ఉండగానే సినిమారంగాన్ని వదిలి ప్రజాసేవకు వస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడు ప్రజలు ఆయన నిర్ణయాన్ని విశ్వసించారు, అందుకే విజయం చేకూర్చారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకచోట విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటనతోపాటు భార్యతో విడాకులు, సినీనటి త్రిషతో అనుబంధాన్ని ప్రత్యర్థులు రాజకీయానికి వాడుకున్నా ప్రజలు మాత్రం వీటిని పట్టించుకోకుండా ప్రత్యామ్నాయం విజయ్ పార్టీనే అని నమ్మారు. సినిమా గ్లామర్, క్రైస్తవ సం ఘాల కృషి అని చెప్పటం ద్వారా విజయ్ విజయాన్ని చిన్నచూపు చూసినట్టవుతుంది.
తమిళనాడు ఫలితాలు రాగానే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ ప్రభావం అంటూ కొందరు జో స్యాలు చెప్పడం మొదలుపెట్టారు. తమిళం లో సూపర్ హిట్ అయిన విజయ్ సినిమాలు కొన్నింటిని తెలుగులో పవన్‌తో తీశారు. ఇద్దరి మధ్య అంతే పోలిక తప్ప మరే పోలిక లేదు. కొన్ని రోజులు చేగువేరా పేరు పవన్ జపించారు. తరువాత సనాతన ధర్మం అని ఊగిపోయారు. మాయావతిని ప్రధాని చేయటమే జీవిత ధ్యేయమని ఆమె కాళ్లు మొక్కా రు. ఆ తరువాత నరేంద్ర మోదీ జపం మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సిని మా డైలాగులు తప్ప సీరియస్‌నెస్ లేదు. చం ద్రబాబును గెలిపించడానికి అభిమానులు, ఆయన సామాజికవర్గం ఓట్లు మళ్లించటం వరకు పవన్ రాజకీయం ఉపయోగపడింది.
– బుద్దా మురళి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

