మీరు చేస్తున్నది, చేయాలనుకుంటున్నది సత్యమే
మేమే కనిపెట్టలేకపోతున్నం
కట్టుగ ఉండలేక పట్టుబడుతున్నం
అవును సార్
మీరనేది మేర మీరకూడదనేది నిజమే
గొంతు విప్పకూడదు
తల అడ్డంగా తిప్పకూడదు
పల్లెత్తి మాట అనకూడదు
మీ దారికి అడ్డం రాకూడదు
అవునవును సార్
మీరు మాటల్జెపుతరు
ఎర్రకోట పీఠమెక్కుతరు
ఇజ్జెతిస్తమంటరు అదిస్తమంటరు
తాగినంతబోస్తరు తాగి అరిస్తే తంతరు
తొక్కుత మంటరు
నరుకుతమంటరు
మీ కడ్డొచ్చినమని మోటరు బండెక్కిస్తారు
మంచిగున్నవ్ సార్.. నువ్వు సల్లగుండాలె!
నీ కడుపులొ సల్ల కదలకుండ ఉండాలె
మేమంతా మీనా కొడుకులమే సార్
తొక్కితే తొక్కిన్రు గని సార్
మా సేతిలో ఓటుంది సర్
సూడాలె మరి!
ఎవరైనా తొక్కెటందుకు కాళ్లున్నయో
ఖలేజా ఉన్నదో!
దమాకున్నదో లేదో
పరీక్ష జేసి సెపుతం సార్
ఫలితం మీకు బంపుతం సార్
సీతారాం, 98665 63519