అనుమానం మానసిక రోగం!

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు దారుణాల్లో హత్యలు చేసింది కట్టుకొన్న భర్తలే. ఒక ఘటనలో ముగ్గురు పిల్లలు తల్లి లేనివారయ్యారు. ఇంకో ఘటనలో, భార్య మీద కోపంతో భర్త కన్నబిడ్డ ప్రాణాలు తీశాడు. వారికి బిడ్డ లేకుండా పోయింది. ఈ రెండు హత్యలకు కారణం ఒక్కటే. అనుమానం అనే పెనుభూతం.
వసరాలకు సరిపోని ఆదాయం, పెరుగుతున్న ఆర్థిక భారం.. భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఆపై లేనిపోని అపోహలు, అనుమానాలతోటే జీవితం వెళ్లదీస్తున్నారు. తనకు తెలియకుండా అత్త మామలకే తన భర్త సం పాదించిన డబ్బంతా ఇస్తున్నాడనేది భార్య ఆరోపణ. తన భార్యకు ఆమె పుట్టింటి వాళ్ళే లేనిపోనివి నేర్పుతున్నారనేది భర్త విమర్శ. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆగ్రహం వెళ్లబోసుకుంటూ దాంపత్య జీవితాన్ని సమస్యలమయంగా మార్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. సగం జీవితాలు అనుమానాలతోనే నాశనమైపోతున్నాయి. జీవితాంతం వెలుగు నీడలా ఉండే భాగస్వామిని అనుమానించడం అనేది ఒక మానసిక రుగ్మతే.
డెల్యూషనల్ డిజార్డర్: డెల్యూషన్ అంటే వాస్తవాన్ని చూడకుండా తమ మనసులోనే ఏవేవో అపనమ్మకాల్ని పెట్టుకుని, అవే నిజమనుకునే భ్రమలో ఉం డటం. ఇలాంటివారు జీవిత భాగస్వామిపై లేనిపోని అనుమానాలు కలిగి ఉండి, వారికి ఆ అనుమానాలను ఆపాదిస్తూ వారిని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
మనసు విప్పి మాట్లాడుకోవాలి: భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య వచ్చినా మనసు విప్పి మాట్లాడుకోవాలి. అప్పుడే సమస్యలు సద్దుమణుగుతాయి. మనుసు విప్పి మాట్లాడుకోవడం వల్ల దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. నిజానికి, ఏ మనిషీ లోపాలు లేకుండా ఉండడు. ఇది భార్యాభర్తలకీ వర్తిస్తుంది. ఇద్దరిలోనూ ఏవో కొన్ని లోపాలు ఉంటాయి. వీటిని పరస్పరం ఎత్తిచూపుకోవటం వల్ల ఘర్షణ పెరుగుతుందేగానీ తగ్గదు. కాబట్టి, లోపాల్ని పట్టుకొని గొడవలు పెట్టుకోకూడదంటే.. ఎదుటివారి స్థానంలో ఉండి మనం ఆలోచించగలగాలి. అప్పుడే సమస్యలకు చెక్ పెట్ట్టొచ్చు. భాగస్వామిలోని సానుకూలతల్ని గుర్తిస్తే ఆలుమగలు సంతోషంగా జీవించవచ్చు.
పరస్పర నమ్మకమే పునాది: కుటుంబభారాన్ని భరించేవాడు భర్త అయితే, బాధలను పంచుకునేది భార్య. ఎన్నోరకాల ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ దాంపత్య బంధం సాఫీగా కొనసాగాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. దాపరికాలు, పక్కచూపులు, అసంతృప్తి లేని దాంపత్య బంధమే కలకాలం సంతోషంగా ఉంటుంది. వీటి లో ఏది లోపించినా ఆప్యాయతకు, అనుబంధానికి ముప్పు వాటిల్లుతుంది. దాంపత్య జీవితంలో కలకలం రేగుతుంది.
మానసిక నిపుణుల అవసరం: చిన్నచిన్న సమస్యలకే భార్యాభర్తల బంధం బలహీనపడితే వారి పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు కూడా సమస్యలతో సతమతమవుతారు. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి. కౌన్సెలింగ్ ద్వారా అనేక కుటుంబ సమస్యలను పరిష్కరించవచ్చు. సమస్య మరీ సంక్లిష్టంగా ఉన్నట్లయితే, ఔషధపరమైన చికిత్స, కౌన్సెలింగ్ ద్వారా నయం చేయవచ్చు. కొద్దిరోజుల చికిత్స అనంతరం అనుమానం అనే రోగం కూడా మటుమాయమై పోతుంది. ఫ్యామిలీ కౌన్సెలర్, సైకియాట్రిస్ట్ వంటి నిపుణుల సలహాలతో, చికిత్సతో మధురమైన దాంపత్య జీవితాన్ని దంపతులు తిరిగి ఆస్వాదించవచ్చు.
(వ్యాసకర్త: రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్)
–అట్ల శ్రీనివాస్‌రెడ్డి
97039 35321
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

