పగలు చదువు, రాత్రి కొలువు
ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందట, భూములన్నీ అయిపోయినయట... ఇక సంక్షేమానికి పైసా లేదని సీఎం రేవంత్రెడ్డి జాతీయ విద్యా ఉత్సవాల వేదికగా సెలవిచ్చిన మాటలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎన్నికలప్పుడు హామీల గంగాళాలు చూయించినోళ్లు...
ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందట, భూములన్నీ అయిపోయినయట… ఇక సంక్షేమానికి పైసా లేదని సీఎం రేవంత్రెడ్డి జాతీయ విద్యా ఉత్సవాల వేదికగా సెలవిచ్చిన మాటలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే! ఎన్నికలప్పుడు హామీల గంగాళాలు చూయించినోళ్లు… ఇప్పుడు చిల్లులువడ్డ సంచులు చూపెడుతుండ్రు. ఇక ఓల్డ్ సిటీ పిల్లలకు సీఎం సలహా మరీ చిత్రంగా ఉన్నది. పొద్దంతా పుస్తకాలతో కుస్తీ పట్టాలె… రాత్రంతా మూసీ ఒడ్డున నైట్ ఎకానమీలో పనులు చేసుకోవాలట! అంటే పగలు చదువు…
రాత్రి కొలువు. మరి నిద్రపోవుడు ఎప్పుడు, ఆ పిల్లల ఆరోగ్యం సంగతి ఏంది? చదివి ఉద్యోగం సంపాదించాల్నా లేక పనిచేసుకుంటూ చదువును పక్కన పెట్టాల్నా? రెక్కాడితే గానీ డొక్కాడని పేద పిల్లల బతుకుల మీద ఇలాంటి ప్రయోగాలెందుకో అని అడుగుతుండ్రు ఓల్డ్ సిటీ ప్రజలు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చుటానికి పైసల్లేవ్, అభివృద్ధికి భూముల్లేవ్… కానీ ఉత్సవాలకు, ఆర్భాటాలకు నిధులు కుమ్మరిస్తున్నరు. వీళ్ల యవ్వారం చూస్తుంటే పేదోడి ఇంట్లో శివరాత్రి పండుగ… పెద్దోడి ఇంట్లో సంక్రాతి విందులు అనే సామెత గుర్తుకొస్తున్నది. ఓట్లు అడుక్కున్నప్పుడు భవిష్యత్తుకు భరోసా అని అంటారు, కానీ ఆ ఓట్లతో గద్దెనెక్కాక ఎవరి బతుకులు వాళ్ల ఇష్టం అంటే ఎట్లా?
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

