సినీనటుడు గిరిబాబు
ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు (83) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
-
650కిపైగా సినిమాల్లో నటనతో తనదైన ముద్ర
-
విజయవంతమైన చిత్రాల నిర్మాణం
-
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
-
నివాళులర్పించిన సినీ ప్రముఖులు
-
నేడు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు (83) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గిరిబాబు ఆరునెలలుగా అల్జీమర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగురోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దవాఖానలో చేర్పించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యా హ్నం స్వగ్రామమైన ఏపీలోని ప్రకాశం జిల్లా రావినూతలలో అంత్యక్రియలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.
గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు.. ‘జగమే మాయ’ చిత్రంతో సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. సుమారు 650లకుపైగా చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. సొంత బ్యానర్‌పై విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ చిత్రం తెలుగులో నిర్మించారు. దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపుదాడి సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. గిరిబాబు సతీమణి శ్రీదేవి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కొడుకులు రఘుబాబు, బోసుబాబు, కుమార్తె మాధవి ఉన్నారు. రఘుబాబు సినీ నటుడుగా కొనసాగుతున్నారు. 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ గిరిబాబు నటించిన చివరి చిత్రం. ఆయన పార్ధివదేహాన్ని శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ప్రొడ్యూసర్స్ గిల్డ్ కాంపౌండ్‌లో ఉంచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

