ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో ఎస్ఐ ఖాళీల భర్తీకి నిర్వహించే రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 4,187 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ)లో సబ్ ఇన్స్పెక్టర్ (జీడీ)- 4001 ఖాళీలు, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ (ఎగ్జిక్యూటివ్) పురుషులు-125, మహిళలు-61 ఖాళీలు ఉన్నాయి.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉన్నవారు అర్హులు. 2024 ఆగస్టు 1 నాటికి వయస్సు 20-25 ఏండ్ల మధ్య ఉండాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, పీఈటీ/పీఎస్టీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో మార్చి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం
వెబ్సైట్: https://ssc.gov.in చూడవచ్చు