ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తనకు తానే పోటీ. ప్రైవేటురంగంలో కొలువుల సృష్టి పరంగానూ తనకు తానే పోటీ. స్వయం ఉపాధికి ఊతం ఇవ్వడంలోనూ తనకు తానే పోటీ. కులవృత్తులను పటిష్టం చేయడంలోనూ తనకు తానే పోటీ. ఇంతకుమించి ఎవరైనా ఇంకేం చేస్తారు? అంతకుమించి చేయడమూ మన కేసీఆర్‌తోనే సాధ్యం. తనకు తానే స్వీయ రికార్డులు అధిగమించాలే తప్ప, ఇతరులకు అనితర సాధ్యం! అదే కోవలోకి వస్తుంది కులవృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున లబ్ధి సంకల్పంపై తాజా విధాన నిర్ణయం.
కనిపించని దైవం కరుణించడం ఒక భావన. కనిపించే దేవుడు కేసీఆర్ అనుగ్రహం ఒక నిజం. మన గురించి మనకంటే గొప్పగా ఆలోచిస్తారు. మనకేం కావాలో తీక్షణంగా తలపోస్తారు. చూస్తుండగానే ఆచరణలో చూపుతారు. కుటుంబానికి అవ్యక్తమైన ఆప్తుడవుతారు. ఒక పాలకుడు ఒక సగటు కుటుంబం నట్టింటకు సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చిన అరుదైన రాష్ట్రం మన తెలంగాణ. అందుకే మనది కేసీఆర్ జమానా. కేసీఆర్‌కు ముందు, కేసీఆర్ ఏలుబడి అనేది చెరగని ముద్ర. ప్రస్తుత, భవిష్యత్తు వనరులను, బతుకునిచ్చే ఉపాయాలను ఎవరి ఊహకూ అందని తరహాలో చేసి చూపిస్తున్నారు. ఆ ఒరవడి ప్రవాహ ఉధృతి కొనసాగింపే తాజా విధాన నిర్ణయం. నీరసించిన కులవృత్తులను నింగికెత్తారు సీఎం కేసీఆర్. ఒక్కో కుల వృత్తి కుటుంబానికి లక్ష రూపాయలతో చేయూతనిచ్చేలా లక్షణమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
ఎవరో అడిగితేనో, ఇంకెవరో డిమాండ్ చేస్తేనో అనేది లేకుండా స్వయంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం విశేషం. కొత్త సచివాలయంలో తొలి మంత్రి మండలి సమావేశంలో ఖరారు చేయడం ద్వారా శుభవార్తల తోరణం విస్తరించారు. అట్టడుగువర్గాల అభ్యున్నతికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాల ఆచరణ పరంపరతో నూతన సెక్రటేరియట్ నామకరణాన్ని సార్థకం చేస్తున్నారు. కులవృత్తి దారులకు అండగా మార్గదర్శకాల ఫైనలైజ్‌కు కేబినెట్ సబ్ కమిటీ వేశారు. వాయు వేగం స్ఫూర్తితో గ్రౌండింగ్ ద్వారా నిర్దేశిత లాభితుల ముఖాల్లో సంతోషం తొణికిసలాడేలా కార్యోన్ముఖం చేస్తున్నారు. మచ్చుకు విప్లవాత్మక దళితబంధుతో సంక్షేమ రాజ్యంపై చెరిగిపోని సంతకమైన కేసీఆర్ కులవృత్తుల జీవితాలు పరిపుష్టం అయ్యేలా మరోసారి పూనుకున్నారు. సుమారు 60 లక్షల బీసీ కుటుంబాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. పలు కులాల వారు కులవృత్తులనే నమ్ముకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వారి జీవనాధారం ప్రశ్నార్థకమైంది. రకరకాల అనర్థాలు చోటుచేసుకున్న దాఖలాలు మరిచిపోలేనివే. వరుసగా రెండో పర్యాయం సహా మొత్తం గడిచిన తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో కుల వృత్తిని బలోపేతం చేస్తున్నారు. ఉదాహరణకు జీవాలే జీవనాధారమైన సామాజిక వర్గాలకు అండగా నిలిచారు. అందరినీ కడుపులో పెట్టుకొని చూసే తత్వం సొంతమైన ధర్మాత్ముడు కేసీఆర్. ఇప్పుడు వివిధ కులవృత్తులలో లబ్ధిదారుల ఎంపికకు కార్యాచరణ తలపెట్టారు. వచ్చే జూన్ 2 నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం నేపథ్యంలో కులవృత్తుల పరిరక్షణ, ఆధారిత కుటుంబాల రాబడి భద్రత గురించి ప్రాధాన్యం హైలైట్ అవుతుంది. ఆయా వ్యాపకాల వ్యక్తులు, కుటుంబాల లాభసాటి మార్గాలకు ఆర్థికంగా అండదండలు దరిచేరేలా దారిచూపుతున్నారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు జరిగే పదేండ్ల తెలంగాణ పండుగ సంబురాల్లోనే ఏ మాత్రం వీలైనా లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల యం త్రాంగానికి, మంత్రి వర్గ ఉపసంఘం ద్వారా దిశానిర్దేశం చేశారు. దీన్నిబట్టి సీఎం కేసీఆర్ కు సమస్త వర్గాల ప్రజల పట్ల ఉన్న ప్రేమానుబంధాన్ని ఊహించవచ్చు.
ఇల్లెందుల దుర్గాప్రసాద్: 94408 50384
(వ్యాసకర్త: ఇండిపెండెంట్జర్నలిస్ట్)