వజ్రోత్సవ స్వాతంత్య్రమా వందనం
వ్యాపారం మాటున పడగలెత్తి అంగాంగం నిలువునా లూటీలు కార్మికుల కర్షకుల ప్రజల కంటిలో శూలాలైపొడిచారు
వ్యాపారం మాటున పడగలెత్తి
అంగాంగం నిలువునా లూటీలు
కార్మికుల కర్షకుల ప్రజల
కంటిలో శూలాలైపొడిచారు
జలియన్ వాలాబాగ్ హత్యాకాండలు
కటిక చీకటి కామాంధుల క్రౌర్యాలు
రౌలత్ చట్టాలు రక్కసి కూపాలు
నోటికీ తాళాలు చేతులకు హాత్కడీలు
ఎదిరిస్తే ఇనుపబోనులు
తెల్లదొరల నల్లపాలనలపై
ఉడుకురక్తం ఏరులై ఉప్పొంగే
దిక్కులు పిక్కటిల్లే హార్తాళ్లు
శాసనొల్లంఘన సహాయనిరాకరణలు
నిప్పుల కంఠం విప్లవ గర్జన
మిన్ను విరిగీ మీదపడ్డా
వెన్నుచూపని విప్లవాగ్నులు
స్వేచ్ఛా స్వాతంత్య్రాలే మా గుండెలని
ఉరికంభమెక్కిన ఉక్కుపిడుగులు
ఇంక్విలాబ్ జిందాబాద్
భగత్ సింగ్ జిందాబాద్
ఊరూరు వీధివీధిన వాడవాడన
కొదమ సింహాలై గర్జించారు
ప్రతి పౌరుని స్వాతంత్య్రానికై
భారతజాతి ఎత్తింది పిడికిలి
నేలనేలంతా ఉద్యమ ఉయ్యాలలు
అమరుల త్యాగాలు
స్వదేశీ భూదానోద్యమాలు
గ్రంథాలయ చైతన్యాలు
ఝాన్సీలక్ష్మీబాయి,దుర్గాబాయ్
సావిత్రి బాయ్ సరోజినీల వీరోచితాలు
గాంధీ అహింసా సత్యాగ్రహాలు
నెహ్రుదీక్షలు అంబేద్కర్ కలలు
నేతాజీ ఫిరంగుల ఘర్జనలు
అల్లూరి, ఆజాద్, తిలక్, దేశభక్తి శౌర్యాలు
అతివాదాలు మితవాదాల ప్రవాహాలు
సర్దార్ జమలాపురం కేశవరావుల వీరత్వాలు
సమస్త భారతం విప్లవ వీరశంఖం
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మట్టికరిపించిన సత్యాగ్రహం
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సూర్యుడు ఉదయించాడు అడుగడుగునా మువ్వన్నెలు
దేశం గుండెలనిండా స్వాతంత్య్రపండుగ
ఇంటింటిపై జాతీయజెండా
ప్రతిఇల్లు మువ్వన్నెల అంగి తొడుకున్నది
అక్కాచెల్లెళ్ల రాఖీలు
జాతీయ పతాకాన్ని కంకణంగా ధరించిరి
ప్రతిపల్లె జాతీయగీతమై పాడుతున్నది
గుండెగుండెకు జెండా జయజయహో
వజ్రోత్సవ స్వాతంత్య్రమా వందనం
అభివందనం
– వనపట్ల సుబ్బయ్య
9492765358
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

