అప్పుడే నాకు పెండ్లా..? లేట్ మ్యారేజీతో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం?
Late Marriage | అప్పుడే నాకు పెండ్లా..?! 30వ వసంతంలో అడుగుపెట్టిన అమ్మాయో, అబ్బాయో ఈ ప్రశ్న వేస్తే ఎలా ఉంటుంది..? పెండ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం, ఎప్పుడు చేసుకోవాలన్నది వ్యక్తిగత విషయం. పెండ్లి ఒక సామాజిక కట్టుబాటు
అప్పుడే నాకు పెండ్లా..?! 30వ వసంతంలో అడుగుపెట్టిన అమ్మాయో, అబ్బాయో ఈ ప్రశ్న వేస్తే ఎలా ఉంటుంది..? పెండ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం, ఎప్పుడు చేసుకోవాలన్నది వ్యక్తిగత విషయం. పెండ్లి ఒక సామాజిక కట్టుబాటు. ఒక్కొక్కసారి వ్యక్తిగత విషయాలూ సామూహిక సమస్యలుగా పరిణమిస్తుంటాయి. ఒకప్పుడు బాల్య వివాహాలు పెద్ద సామాజిక సమస్య! ఇప్పటికీ, అక్కడక్కడ బాల్యవివాహాలు జరుగుతున్నా వాటి సంఖ్య స్వల్పమే.
ఒకప్పుడు వితంతువులు మళ్లీ పెండ్లి చేసుకోవడం కలలో మాట. అదొక సాహసం. ఎన్ని వెక్కిరింతలు, వెటకారాలు భరించాల్సి వచ్చేదో. ఇప్పుడు వీటికీ సామాజిక ఆమోదం లభిస్తున్నది. వృద్ధ జంటలకు పెండ్లి.. గత కాలంలో ఊహకందని విషయం. నిల్చోలేని, నడవలేని వృద్ధుడికి ముక్కుపచ్చలారని బాలికలను పెండ్లి చేసిన చరిత్ర ఉన్నది కానీ, ఒక వృద్ధుడు మరో వృద్ధురాలిని పెండ్లాడటం కొత్త ట్రెండ్! వృద్ధులకూ స్వయంవరాలొచ్చాయ్!

పాతికేండ్లు నిండిన బ్రహ్మచారులను ముదురుబెండకాయలుగా వెక్కిరించిన రోజులు గతించిపోయాయి. ఈ కాలంలో 30 ఏండ్లలోపు పెండ్లయితే సకాలంలో జరిగినట్టే లెక్క. ప్రస్తుతం నడుస్తున్నది థర్టీ ప్లస్ (30+) ట్రెండ్! మూడు పదులు నిండిన తర్వాతే మూడుముళ్ల బంధం. ఫస్ట్ ప్రియారిటీ కెరీర్. ఆ తరువాతే మ్యారేజ్. ‘బాగా సంపాదించు.. కంఫర్టబుల్‌గా జీవించు’ ఈ తరం యువతను నడిపిస్తున్న మంత్రం ఇదే. ప్రపంచీకరణ యుగపు అవకాశాలను అందిపుచ్చుకున్న నవతరం పెండ్లి, సంసారం, పిల్లలను కనడం.. ఇలాంటి విషయాల్లో ఏమాత్రం తొందరపడటం లేదు. ఉద్యోగంలో చేరగానే పెండ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే భయం, సంసార బంధంలో చిక్కుకుంటే అప్పటిదాకా అనుభవించిన స్వేచ్ఛ దూరమవుతుందనే ఆందోళన.. వెంటాడుతుంది. ఉన్నత చదువుల కోసం చేసిన అప్పులు తీర్చుకోవాల్సిన బాధ్యత, తమ కోసం శ్రమించిన అమ్మానాన్నలకు ఎంతోకొంత ఆర్థిక అండదండలు అందించాలన్న తపనలాంటివి ఉంటాయి. వీటికి తోడు తమకు తగిన జోడీ తొందరగా దొరకకపోవడం, తమ స్థాయికి తగ్గ సంబంధాలు రాకపోవడం.. ఇలాంటి సవాలక్ష కారణాలు పెండ్లి వాయిదాపడటానికి కారణాలవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడంతో పిల్లల పెండ్లి గురించి తొందరపెట్టేవారు కరువయ్యారు.
మూడు పదులు క్రాస్ అవుతున్నా.. ఏజ్ బార్ సమస్య ముంచుకొస్తున్నా.. పెండ్లి పీటలెక్కకపోవడం వాంఛనీయమేనా? లేట్ మ్యారేజీ ఆయా జంటల భవిష్యత్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వారికి పుట్టే పిల్లల విషయంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? సామాజిక సంబంధాల్లో ఏ మార్పులు మోసుకొస్తుంది? ఇలాంటివన్నీ సీరియస్‌గా ఆలోచించాల్సిన, అధ్యయనం చేయాల్సిన అంశాలు.
సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం: వయసు ముదిరిన తర్వాత పెండ్లాడటం వల్ల ఎదురయ్యే ముఖ్యమైన సమస్య సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లడం. సాధారణంగా స్త్రీలకు 35 ఏండ్లు దాటితే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో ఫెర్టిలిటీ సెంటర్లు, హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, అప్పటిదాకా సంపాదించినదంతా వాటికే ధారపోయాల్సిన దుస్థితి దాపురిస్తుంది. లేటు వయస్సు గర్భధారణ వల్ల గర్భిణీతోపాటు పుట్టే పిల్లలకూ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందనేది వైద్యుల అభిప్రాయం. ముఖ్యంగా గర్భిణీగా ఉన్నప్పుడు డయాబెటిస్, బీపీ లాంటి సమస్యలు తలెత్తడం, కవలలు జన్మించడం, జన్యులోపాలు, నెలలు నిండని, బరువు తక్కువ పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని వైద్య నిపుణుల హెచ్చరిక. లేటు వయస్సులో పిల్లలను కనడం వల్ల, ఆఫీసు పని ఒత్తిడి కారణంగా వారితో తగినంత సమయం గడపలేకపోతున్నామని, బుడిబుడి అడుగుల సవ్వడిని, ముద్దుముద్దు మాటల మాధుర్యాన్ని అనుభవించలేకపోతున్నామనేది మరికొందరి ఆవేదన.
వృద్ధాప్యంలో మరో వేదన!: లేట్‌గా పెండ్లి చేసుకొని, ఆలస్యంగా పిల్లలను కనడం వల్ల ఎదురయ్యే మరో ముఖ్య సమస్య రిటైరయ్యేనాటికి సంతానం చేతికి అందిరాకపోవడం! వారి పట్ల తమ బాధ్యతలు తీర్చుకోలేకపోవడం!! ఒకవైపు తాము సంపాదన సామర్థ్యాన్ని కోల్పోతుంటే, తమ పిల్లలు కెరీర్లో స్థిరపడకపోవడం నిస్సందేహంగా వృద్ధాప్యంలో కుంగదీసే అంశం. మన స్నేహితులు మనుమలు, మనుమరాళ్లతో ఉల్లాసంగా గడుపుతుంటే.. తాము ఆ మాధుర్యాన్ని కోల్పోతున్నామన్న బాధ వెంటాడటం సహజం.
లేట్ మ్యారేజీ బ్యాచ్‌తో పోల్చుకుంటే.. సకాలంలో పెండ్లి చేసుకొని, అన్యోన్యంగా సం సారం సాగిస్తున్న జంటలు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటున్నాయని, ఏమైనా సమస్యలు వచ్చినా త్వరగా కోలుకుంటున్నారని అనేక అధ్యయనాలు, సర్వేలు సూచిస్తున్నాయి. కాబట్టి ముప్పైలోనూ పెండ్లికి తొందరేముంది? అనుకోకండి.
కందిబండ కృష్ణప్రసాద్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

