పాలమూరు పరవళ్లు
గంగమ్మ గంగమ్మా కోల్- ఘనమైనా గంగా కోల్ శ్రీశైల కొండల్లో కోల్- కొలువైనా గంగా కోల్ పాలమూరులోనా కోల్- ప్రాజెక్టూ గట్టీ కోల్ కేసీఆరు సారూ కోల్- గంగను పిలిచిండూ కోల్
గంగమ్మ గంగమ్మా కోల్- ఘనమైనా గంగా కోల్
శ్రీశైల కొండల్లో కోల్- కొలువైనా గంగా కోల్
పాలమూరులోనా కోల్- ప్రాజెక్టూ గట్టీ కోల్
కేసీఆరు సారూ కోల్- గంగను పిలిచిండూ కోల్
చేతులెత్తి మొక్కీ కోల్- చేరా రమ్మండూ కోల్
ఎత్తెత్తు మోటార్లూ కోల్- ఎత్తీ పోయంగా కోల్
అలుగులు దుంకి కరువు నేలను అలుముకున్నదమ్మో సెల్లెల
గలసవ్వడితో కృష్ణమ్మా- గలుమకాడికొచ్చే సెల్లెల
కిలకిల నవ్వులతో కృష్ణమ్మా-పొలమెల్లా బారే సెల్లెల
దుబ్బలేసి నా సెలుక భూములా- దూప తీర్చినాదో సెల్లెల
చెరువు కట్ట మీదా-పాల పిట్టలెగిరే
చెరువు నీళ్లలోనా-చేప పిల్లలాడే
తుంగ గడ్డి మీదా అహ బుడుబుంగా లాడే
నిండిన చెరువూ తడలు గొట్టెను
మత్తడి దుంకీ అలుగు బారెను
తూములనిడిసితె బూములు తడిసెను
నల్లరేగడిలో నాట్లు సాగెను
నార్లపురములోనా కోల్- నడకలు నేర్చిందీ కోల్
ఎగసిపారుకుంటా కోల్- ఏదులకొచ్చిందీ కోల్
వయ్యారి నడకలతో కోల్-వట్టెంచేరిందీ కోల్
కురుమూర్తికి మొక్కీ కోల్ కరివెనకొచ్చిందీ కోల్
ఉద్దండపురమూలో కోల్-ఉరకలు వేసిందీ కోల్
లక్ష్మిదేవిపల్లే కోల్-లక్షణంగ చేరే కోల్
కరువు బాధతో కటకటలాడిన కథలు మారిపాయే సెల్లెల
ఎతలు తీరిపాయే సెల్లెల (కోరస్)
తాళం పడ్డా ఇండ్లకు మళ్ళా తోరణాలు కట్టే సెల్లెల
– మామిడి తోరణాలు కట్టే సెల్లెల
మొరం తేలిన వాకిండ్లల్ల ముగ్గులు వెలిసినాయో సెల్లెల
చక్కని ముగ్గులు వెలిసినాయో సెల్లేల
ఊరు విడిచినా సోర పిల్లలూ ఉరికివచ్చిరమ్మో సెల్లెల
దరికిచేరిరమ్మో సెల్లెలా (కోరస్)
ఎండిపోయినా సేతానాలు పండుగైనయమ్మో సెల్లెల
నిండుగైనయమ్మో సెల్లెల (కోరస్)
నీళ్లు మలిపినావూ మా బతుకు నిలిపినావూ
కేసీఆరు సారూ – నీకూ కోటీ దండాలూ
కేసీఆరు సారూ – శత కోటీ దండాలూ
పట్టుబట్టినవు ఒట్టుబెట్టినవు పాలమూరు ప్రాజెక్టు గట్టినవు
పల్లములోనా పారేగంగనుమిట్టమీదికీపట్టుకొచ్చినవు
నాగర్ కర్నూల్లో కోల్ నాట్యామాడిందీ కోల్
మాబూబ్నగరూలో కోల్ బిరబిర ఉరికిందీ కోల్
నారాయణపేటలోనా కోల్ నురగాలెత్తిందీ కోల్
రంగరెడ్డిలోనా కోల్ చెంగున దుంకిందీ కోల్
వికారాబాదులో కోల్ విలసిల్లే గంగా కోల్
పన్నెండువందాలా కోల్ ఊర్లదూపతీరే కోల్
పన్నెండు లక్షాలా కోల్ ఎకరాలూ పారే కోల్
పాలుపొంగేటిజీవగడ్డగా పాలమూరు మారే సెల్లెల
చెరువులు నిండీ పల్లెల ఎవుసం పనులు జోరుగాయేసెల్లెల
దేశదేశాలకూలీలంతాపాలమూరుకొచ్చీసెల్లెల
– నాట్లు వేయబట్టేసెల్లెల
పాలమూరుకే పరుగు పరుగునా వలసలు రాబట్టే సెల్లెల
– కాలమెంత మారే సెల్లెల
అణువణువున గంగా పారేటిరోజులొచ్చే
తనివితీర నేలా తడిసేటిరోజులొచ్చే
మూడు పంటలాతోమురిసేటిరోజులొచ్చే
కేసిఆరె మన ఇంటి దీపమూ
బంగరు పంటల బతుకు రూపము
కరువు సీమ తలరాతను మార్చిన చల్లని పాలన వర్దిల్లాలే
గులాబి జెండానూ గుండెల్లో నిలపాలె
కేసీఆరు సారే మల్లా గెలవాలె
– డి.అభిజ్ఞ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

