కరువు ముంచుకొచ్చి కాటేయకముందే!
మూటాముల్లె సర్దుకుని నమ్మకాన్ని ఆడనే వదిలేసుకుని గింజల్ని పైసల్కి అమ్ముకుని వలసెళ్లిపోవాలేమో
మూటాముల్లె సర్దుకుని
నమ్మకాన్ని ఆడనే వదిలేసుకుని
గింజల్ని పైసల్కి అమ్ముకుని
వలసెళ్లిపోవాలేమో
నెర్రులిడిచిన నేల పొరల్లో ఇరుక్కుని
ఊపిరాడక కూలబడేకన్నా
అరువు బరువు నెత్తిని చిట్లించకముందే
కరువు పాము కాటేయకముందే
సామాన్లు సర్దుకోవడం మంచిదేమో
కారుమబ్బు కమ్ముకోకముందే
పల్చటి చినుకు వెక్కిరించకముందే
మొలకలేని సెలక అంగలార్చకముందే
తట్టాబుట్ట చేతబట్టి వలసెళ్లాలేమో
చినుకు లేని చింత చిదిమేయకముందే
పంట లేని వ్యథ కబళించకముందే
బీడు భూమి కండ్లు చెమ్మగిల్లకముందే
ఉష్ణతాపంతో మేఘం చెదిరిపోకముందే
తలుపులు మూసి గాలికి ఎదురేగాలేమో
గాలి దుమారం విసిరివేయకముందే
పొడిబారిన నేల నిప్పు రాజేయకముందే
ఆర్థిక వలలో బందీ కాకముందే
కాలం కాని కాలం గవిలో తలదాచకనే
కంటిమీద రెప్పవాల్చని స్థితికి రాకముందే
భత్యం కోసం బతుకు బండి నడపాలేమో
ఎదురుగాలికి పయనం తప్పదేమో
నరెద్దుల రాజారెడ్డి
9666016636
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

