అర్ధరాత్రి కురిసిన వెన్నెల దీపం
ఉడుకు నెత్తురు ఉప్పెనై నిప్పుల కాసారపు నెగడులై భగ భగ మండే భగత్ సింగ్ లై ఒక్కో నిప్పురవ్వ ఏకమై నింగిని తాకి దావనంలా దహించు వేళ స్వేచ్ఛా సూర్యుణ్ణి ముద్దాడిన వేళ
ఉడుకు నెత్తురు ఉప్పెనై
నిప్పుల కాసారపు నెగడులై
భగ భగ మండే భగత్ సింగ్ లై
ఒక్కో నిప్పురవ్వ ఏకమై నింగిని తాకి
దావనంలా దహించు వేళ
స్వేచ్ఛా సూర్యుణ్ణి ముద్దాడిన వేళ
రవి అస్తమించని సామ్రాజ్యం అస్తమించిన వేళ
అర్ధరాత్రి కురిసిన వెన్నెల దీపం
కన్నీటితో వెలిగిన వేకువ
రాలిన శిరసుల రాతి శాసనం
పారిన నెత్తుటి రుధిర ఆసనం
ఎన్ని కథలు కంచికి చేరెనో…
రక్తం చిందించి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం
మా గుండెలు చీల్చి భరతమాత పాదాలు కడిగాం
పోయిన శీలాలు, శిథిలాల కుప్పలు
రాలిన ప్రాణాలు, రేపటి పొద్దు పొడుపులు
నిద్ర లేచిన వాడిది స్వాతంత్య్రం..
శాశ్వత నిద్రలో ఒరిగిన అమరులది ధీరత్వం..
ఉడుకు నెత్తురు ఉప్పెనై
ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి
అజాదీ కా అమృతోత్సవ్ కి అధిపతి
బాల గంగాధర్ తిలక్
హర్ ఘర్ కా తిరంగా ధర్ ఝాన్సీ లక్ష్మీ బాయి
హిందూ ముస్లిం భాయి భాయి
మువ్వన్నెల జెండా మూడు తరాల అండ
పింగళి వెంకయ్య కీర్తి కొండ
ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వేచ్ఛకు మూల ధనం
పునాది రాళ్లకు వందనంఅనాది వీరులకు అభివందనం
– ఎన్ లహరి
9885535506
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

