దేవుడన్నా.. నా దేవుడు!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చాలని ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలిసిపోయారు. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీలకు, వచ్చే ఏడాది పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగనుండటంతో జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సహా ఎవరినీ మార్చడం లేదని పార్టీ పెద్ద లు తేల్చిచెప్పడంతో డీలా పడిపోయారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చాలని ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలిసిపోయారు. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీలకు, వచ్చే ఏడాది పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగనుండటంతో జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సహా ఎవరినీ మార్చడం లేదని పార్టీ పెద్ద లు తేల్చిచెప్పడంతో డీలా పడిపోయారు. అయితే గత నెల రాజస్థాన్, ఢిల్లీ, బీహా ర్, ఒడిశా రాష్ర్టాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ నియమించింది. ఇందులో రాజస్థాన్‌కు ఈ ఏడాదే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మళ్లీ ఆశలు చిగురించడంతో పార్టీ నేతలు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేశారు.
హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన ముగిసాక బండిని మార్చనున్నట్టు హింట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. అయితే వీరి ఆశలన్నీ ఆడియాసలు చేస్తూ ఎస్ఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజీలో బండి సంజయ్ అరెస్టయ్యారు. గతంలో కూడా ఇలానే బండిని మార్చాలని అనుకున్నప్పుడే అరెస్టు జరగడంతో కొనసాగించక తప్పలేదు. ఈ సారి కూడా సరిగ్గా మార్చాలనుకున్నప్పుడే అరెస్టు జరగడంతో మళ్లీ ఎక్స్టెన్షన్ అయినట్టేనని బండి వ్యతిరేకులు వాపోతున్నారు. కాగా ఏదోవిధంగా ప్రతిసారి గండం నుంచి గట్టెక్కుతుండటంతో ఆయన వర్గీయులు మాత్రం ‘కేసీఆర్ దేవుడన్నా ..దేవుడు’ అని కొనియాడుతున్నారు.
– వెల్జాల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

