యువత ఆశలకు వెలుగు కేటీఆర్
ప్రతి తరమూ తన కాలాన్ని నిర్వచించే కొంతమంది వ్యక్తులను చూస్తుంది. వారు కేవలం పదవుల్లో ఉన్న నాయకులు మాత్రమే కాదు, ఒక ఆలోచనకు రూపం ఇచ్చినవారు, ఒక సమాజం కలలకు దిశ చూపినవారు, భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చేసినవారు.
ప్రతి తరమూ తన కాలాన్ని నిర్వచించే కొంతమంది వ్యక్తులను చూస్తుంది. వారు కేవలం పదవుల్లో ఉన్న నాయకులు మాత్రమే కాదు, ఒక ఆలోచనకు రూపం ఇచ్చినవారు, ఒక సమాజం కలలకు దిశ చూపినవారు, భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చేసినవారు. అలాంటి నాయకత్వం రాజకీయాల పరిమితులను దాటి, యువత మనసుల్లో ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. తెలంగాణలో అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలిచే పేరు కల్వకుంట్ల తారకరామారావు. నేటి రాజకీయాల్లో ఆధునికత, సాంకేతికత, పరిపాలనా సామర్థ్యం, మానవతా విలువలు కలగలిపిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయం అంటే ఎన్నికలు గెలువడం, సభల్లో ప్రసంగించడం మాత్రమే కాదని, ప్రపంచంతో పోటీపడే నగరాలను నిర్మించడం, యువతకు అవకాశాలు కల్పించడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించడం అని గత ప్రభుత్వంలో మంత్రిగా తన పనితీరుతో నిరూపించారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ర్టానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలంటే సంప్రదాయ అభివృద్ధి సరిపోదని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆ ఆలోచనలకు ప్రతిరూపంగా నెలకొల్పిందే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్లలో ఒకటైన టీ-హబ్. వేలాది మంది యువ పారిశ్రామికవేత్తలకు ఇది ఒక ప్రయోగశాలగా, కలల వేదికగా మారింది. గ్రామీణ, పట్టణ, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా ఎవరైనా తమ ఆలోచనను ప్రపంచ స్థాయి వ్యాపారంగా మార్చుకొనే అవకాశాన్ని టీ-హబ్ కల్పిస్తున్నది. ప్రపంచ స్థాయి మెంటార్లు, పెట్టుబడిదారులు, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాలను కూడా ఈ వేదిక అందిస్తున్నది. కేటీఆర్ మరో ఆలోచన టీ-వర్క్స్. టీ-వర్క్స్ ద్వారా హార్డ్‌వేర్ ఇన్నోవేషన్‌కు కొత్త దిశ చూపించారు. ఒక ఆలోచనను కాగితం మీద నుంచి ఉత్పత్తిగా మార్చడానికి అవసరమైన యంత్రాలు, ప్రయోగశాలలు, ప్రోటోటైపింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల అనేక మంది ఇంజినీర్లు, మేకర్లు, పరిశోధకులు తమ కలలను ఆచరణలోకి తీసుకురాగలిగారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ రంగంలో మరింత బలంగా నిలబెట్టడంలో కేటీఆర్ పాత్ర విశేషమైనది.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను తెలంగాణకు తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేశారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశాలు, విదేశీ పర్యటనలు, పరిశ్రమలకు అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ ద్వారా పెట్టుబడులకు హైదరాబాద్ ఆకర్షణీయమైన నగరంగా మారింది. లక్షలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వడం కేటీఆర్ పరిపాలనా దూరదృష్టికి నిదర్శనం.
ఫార్ములాఈ రేస్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు కేవలం వినోదం కోసం కాదు, ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మళ్లించేందుకు, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, నగరాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టేందుకు ఉపయోగపడే వేదికలుగా ఆయన భావించారు. రాజకీయాల్లో మానవత్వాన్ని తన ముఖ్యమైన విలువగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. రైతులు, మహిళలు, యువత, వృద్ధులు, పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పలు వేదికలపై పిలుపునిచ్చారు.
ప్రజలు సమస్యలను నేరుగా తెలియజేయడానికి, యువత తమ ఆలోచనలను పంచుకోవడానికి, ప్రభుత్వంతో సంభాషించడానికి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించారు కేటీఆర్. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడటం, వారి సమస్యలను వినడం, స్పందించడంతో యువతలో కేటీఆర్ పట్ల విశ్వాసం మరింత పెరిగింది. అందుకే ఆయన ‘యూత్ కనెక్ట్’ ఉన్న లీడర్‌గా గుర్తింపు పొందారు. ఒక నాయకుడి గొప్పతనం ఆయన అధికారంలో ఎంతకాలం ఉన్నారనేదానిలో ఉండదు. ఆ నాయకత్వంలో ఎంతమంది తమ జీవితాలను మార్చుకొనే అవకాశం పొందారనే దానిలో ఉంటుంది. యువత ఉద్యోగం పొందినప్పుడు, స్టార్టప్ ప్రారంభించినప్పుడు, తన ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు, ఒక విద్యార్థి తన కలను నిజం చేసుకునే ధైర్యం పొందినప్పుడు అక్కడ నాయకత్వం తన అసలు అర్థాన్ని సంతరించుకుంటుంది. అలాంటి మార్పులను లక్ష్యంగా పెట్టుకున్న నాయకత్వం సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి ప్రభావం చూపిన, చూపుతున్న నాయకుడు కేటీఆర్.
యువత చేతిలో ప్రతిభ ఉంటే, దానికి దిశ చూపే నాయకత్వం కూడా ఉండాలి. అలాంటి నాయకత్వానికి ఉదాహరణ కేటీఆర్. ఇంకా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలి, యువత తమ ప్రతిభను ప్రపంచానికి చాటాలి. అందుకు ఆ నాయకత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. తెలంగాణ బ్రాండ్ గ్లోబల్ వేదికపై సత్తా చాటాలి. యువత ఆశలకు వెలుగై, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో తనదైన ముద్ర వేసిన కేటీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
– మహేందర్ తోటకురి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

