సదాశివతాండవం స్ఫూర్తిగా..
దాహార్తితో పిడచకట్టుకుపోయిన నాలుక మీది బీజాక్షరాలు కుమ్రం భీం...
దాహార్తితో పిడచకట్టుకుపోయిన
నాలుక మీది బీజాక్షరాలు
కుమ్రం భీం…
ఎత్తిపోసిన పాటల ప్రవాహాలకు
బీడువారిన నేల దేహమంతా
నిరసనల నిగారింపు పైరు..
బతుకుల తాయిమాయి
తాళానికి
మోడైన ఎడారి నిస్పృహ రాజేసిన
రాగం సదాశివుడు..
వెలివేతల వలపోతల
గుండె కోతల
చెమట చెమ్మాసుల వెక్కిళ్ళ
పాటల పల్లవి సదాశివుడు…
పదం పదం కదిలి
కాలాన్ని ఉద్వేగితం చేసిన
ఆ గాన తాండవం
తలరాతలను తాకని తలాపు నదులకు
నడక నేర్పింది..
శృతి కలిపిన చేను చెలుకల కళ్లల్లోంచి
అమాసలను తరిమి
వెక్కిరించిన అభివృద్ధి తమాషాలను
నిలదీసింది…
పల్లవి ప్రణవమై ప్రాణమైన పోరాటం
వలస గాయాలకు లేపనమైంది.
అర్ధ శతాబ్ది ఆకలిని దాటించిన
అక్షరం సాక్షిగా కూతపెట్టిన సైరన్
మడమ తిప్పని లక్ష్యాల
దీక్షలలో ప్రతిధ్వనిస్తుంది.
శివుడూ!!!
గాలి స్తంభించినప్పుడల్లా
సుడిగట్టిన నీ ఆలోచనలు
కొడిగట్టిన మా ఆశలకు చమురై
దీపం నించి దీపాన్ని జాగృతం చేసి
వెలుగుల అలుగులు దూకిస్తాయి.
సోమరితనం సోపతికి
కాటకం కాటేసే బూచి కావచ్చు
పసిఫిక్ తూర్పు తీరాల వేడి గాలి
ఓ సాకు కావచ్చు కానీ
ఎన్ని ఎలినినోలనైనా
ఒక్క ఆత్మవిశ్వాసంతో గెలుస్తాం…
దడిగట్టి గరిగట్టిగా నిలుస్తాం…
కరువు మా చుట్టం కాదు
కాయకష్టం కొత్త కాదు…
నెలవంకను నెత్తికెత్తుకున్న
సదాశివతాండవం స్ఫూర్తిగా
మాకు మా మట్టి ఊపిరిని
ఉగ్గ పట్టుకోవటం తెలుసు
దోచుకుపోతున్న వనరులను
తిరిగి తెచ్చుకోవడం తెలుసు
మా నేలకు నైరుతి
దారిమళ్లించటమూ తెలుసు
వఝల
శివకుమార్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

