ముందడుగే ఆయన నైజం
‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు’ అంటే.. ‘ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు, కట్టిపడేసే ప్రసంగాలు’ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆయన లో ఉన్న మరో కోణం చాలామందికి తెలియదు. కేసీఆర్ ఒక మానవతావాది. అతిథులకు ఇచ్చే మర్యాద, దైవభక్తి, దేశభక్తి కూడా ఆయనలో మెండుగా ఉన్నయనే విషయం ఆయనకు చాలా దగ్గరగా ఉండేవారికి మాత్రమే తెలుసు
‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు’ అంటే.. ‘ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు, కట్టిపడేసే ప్రసంగాలు’ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆయన లో ఉన్న మరో కోణం చాలామందికి తెలియదు. కేసీఆర్ ఒక మానవతావాది. అతిథులకు ఇచ్చే మర్యాద, దైవభక్తి, దేశభక్తి కూడా ఆయనలో మెండుగా ఉన్నయనే విషయం ఆయనకు చాలా దగ్గరగా ఉండేవారికి మాత్రమే తెలుసు. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు ఒక పరిధి దాటితే ఆయన ఒప్పుకోరు. దానికి ఉదాహరణే ఆ మధ్య అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ రాహుల్‌గాంధీపై చేసిన విమర్శలను కేసీఆర్ తీవ్రంగా ఖండించడం. ఇది ఆయన రాజయకీయ విలువలకు నిదర్శనం.
ప్రత్యర్థులకు సైతం అండగా..: రాజకీయంగా విభేదాలున్నప్పటికీ తన ప్రత్యర్థికి ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, సహాయం చేయడానికి కేసీఆర్ వెనుకాడరు. ప్రత్యర్థి పార్టీకి చెందిన మెదక్ జిల్లా నేత ముత్యంరెడ్డికి ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే అమెరికాకు పంపి చికిత్స చేయించారు. ఇలా సన్నిహితులు, ప్రత్యర్థులు ఎవరైనా సరే, సదరు వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడని ఆయన దృష్టికి వస్తే చాలు, వెంటనే స్పందిస్తారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు బాధితులకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు.
పార్టీ మీటింగులు, ప్లీనరీ సమావేశాల్లో తప్ప వారి ఇంట్లో నేను కేసీఆర్‌ను కలిసింది కొన్ని సందర్భాల్లోనే. అయినా ఆ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలు, ఆయన అతిథి మర్యాదలు జీవితంలో మరచిపోలేని మధురానుభూతులు. ఆయనకు దేశభక్తి ఎక్కువ. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను చూడాలని చెప్తుంటారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని సవరించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని మార్చాలనే చర్చను లేవదీశారు. దీనిపై అవగాహన లేని ప్రతిపక్షాలు, దళిత సంఘాలు అమాయక ప్రజలను రెచ్చగొట్టి కేసీఆర్‌పై ఉసిగొల్పారు. కేసీఆర్ పార్టీ పెట్టిందే అంబేద్కర్ చెప్పిన ‘బోధించు, సమీకరించు, పోరాడు’ ప్రాతిపదికన. గాంధీజీ బోధించిన శాంతియుత ప్రజా ఉద్యమాన్ని కేసీఆర్ పాటిస్తారు.
యువకులను, నాయకులుగా మలిచి..: స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో కొన్ని వందల రాజకీయ పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోయాయి. కానీ ఒక ఉప ప్రాంతీయ, ఉద్యమ పార్టీ పెట్టి ఏకంగా 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని మెప్పించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటి మీదికి తెచ్చి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీని ఒంటి చేత్తో ఇరువై ఏండ్ల మైలు రాయిని దాటించారు. ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన యువకులను నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌ది. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణను ఆణువణువూ ఆవాహం చేసుకున్న కేసీఆర్ తెలంగాణను దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టారు. రాజకీయాలపై ఆసక్తి ఉండి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న నా లాంటి యువతకు కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీ కొత్త ఆశలను, నమ్మకాన్ని కలిగించింది.
ముందుకు వెళ్లడమే ఆయన నైజం..: ఏదైనా ఒక విషయమై పలువర్గాల మేధావులతో మేధోమథనం చేసి ఒక స్థిరమైన, కచ్చితమైన అభిప్రాయం ఏర్పర్చుకున్న తర్వాత వెనుకడుగు వేయకుండా ముందుకువెళ్లడమే కేసీఆర్ నైజం. కేసీఆర్ ఎవరికీ తలొగ్గడు. అందుకే ఆయనంటే గిట్టనివాళ్లు బదనాం చేయజూస్తారు.
గుండెల నిండా దేశభక్తి…: కుటుంబసభ్యులను, గురువులను, నాయకులను, కార్యకర్తలను, ప్రతిపక్ష నాయకులను కేసీఆర్ ఎలా గౌరవిస్తారో చాలా సందర్భాల్లో మనం చూశాం. కేసీఆర్ విప్లవ భావాలున్న కవి, మంచి రచయిత. అందుకే ఆయన ఉద్యమ సందర్భంలోనూ పాటలు రాశారు. కేసీఆర్ మానవతా దృక్పథం ఉన్న మహానేత. గుండెల నిండా దేశభక్తి, తనువంతా దైవత్వం, నరనరాన తెలంగాణను ఆవాహం చేసుకున్న నాయకుడు కేసీఆర్. విలువలతో కూడుకున్న నాయకుడు, దార్శనికుడు మన కేసీఆర్.
– కాసర్ల నాగేందర్ రెడ్డి
+61 478 311 563
(వ్యాసకర్త: అధ్యక్షులు, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

