చరిత్రాత్మకం..
తెలంగాణ రాష్ట్ర కల సాకారమయ్యాక సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే రికార్డు స్థాయిలో 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. తాజాగా జోనల్ అడ్డంకులను దాటి మరో 91,142 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపుతూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించటం
తెలంగాణ రాష్ట్ర కల సాకారమయ్యాక సీఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే రికార్డు స్థాయిలో 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. తాజాగా జోనల్ అడ్డంకులను దాటి మరో 91,142 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపుతూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించటం హర్షణీయం. రాష్ట్ర చరిత్రలో ఇదొక చరిత్రాత్మకమైన రోజు.
అసెంబ్లీలో ప్రకటన వెలువడగానే విద్యార్థులు, నిరుద్యోగ యువత టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఉద్యోగాల భర్తీ పూర్తయితే దేశ చరిత్రలోనే ఎనిమిదేండ్లలో 2,25,084 ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారు.
తెలంగాణ విద్యార్థులు, యువకుల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో సీఎం కేసీఆర్ 91,142 ఉద్యోగాల నియామక ప్రకటన చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న 11,103 మంది సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. తక్షణమే 80,039 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించడం ముదావహం. రాష్ట్ర సాధనోద్యమంలో కీలక పాత్రను
పోషించిన యువత కోసం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల సంరంభం యువతీ యువకులకు బంగారు భవిష్యత్తును అందించనున్నది.
గత ప్రభుత్వాల హయాంలో పైరవీలు, అవినీతితో ఉద్యోగాలను సంతలో సరుకుగా మార్చారు. కానీ తెలంగాణ అవతరణ తర్వాత పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా నియామకాల ప్రక్రియ జరుగుతున్నది. ఏ ఒక్క పోస్టు భర్తీలోనూ అవినీతికి తావివ్వలేదు. ఇదే పారదర్శకత, స్ఫూర్తి త్వరలో భర్తీ చేయబోయే ఉద్యోగాల విషయంలోనూ కొనసాగనున్నది. ఖాళీ ఉద్యోగాలను వెంటనే
గుర్తించి ఉద్యోగాల క్యాలెండర్‌ను ప్రకటిస్తామని సీఎం చెప్పడం ఆహ్వానించదగిన పరిణామం.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న అనేక పాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ర్టాభివృద్ధిని వేగవంతం చేశారు. స్థానికులకే అవకాశాలు దక్కేలా చేశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి కేంద్రం అనేక ఇబ్బందులను సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నప్పటికీ నిధులు, నీళ్లు, నియామకాలు తదితర అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలే ఊపిరిగా కేసీఆర్ ముందుకుపోతున్నా రు. అన్నివర్గాల
దీవెనలతో కేసీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భవిష్యత్ భారత నిర్మాణానికి ఆయనే బాటలు వేయాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ, చైర్మన్)
– డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
94905 24724
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- announcement
- CM KCR
- historical
- job
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

