సరెండరైన ఎలుక!
తప్పెవరిదీ కాదు తొందర పాటంతా నాదే పలుసార్లు బల్లి పడింది కదాని నేను దుంకాను అంతే...!
తప్పెవరిదీ కాదు
తొందర పాటంతా నాదే
పలుసార్లు బల్లి పడింది కదాని
నేను దుంకాను అంతే…!
బొద్దింకలు ఈగాదులు
ఎన్నిసార్లు పడినా
అవి పాకంతో కలిసిపోతవి
నాకే తెలివి లేక…!
తెరిచుంచిన గిన్నె మీంచి
చెట్నీ ఉందని చూసుకోక ఎగిరాను
కాలు జారి మీ వీడియో కంట పడ్డాను
దొరికిన దొంగనయ్యాను!
ఒకవైపు ప్రాణ భయంతో నేను
విలవిలలాడుతుంటే భూత దయలేక
వీడియో తీసిన వారిని కదా
అనాల్సింది తిట్టాల్సింది!
ఆ పేద విద్యార్థులకు
ఆహారమైనా బాగుండేది
టీవీ ఛానెల్స్ పదే పదే చూపిస్తుంటే
డ్రగ్స్ తీసుకున్న సెలబ్రెటీనయ్యా!
ఇది మాకు తొలిసారి కాదు
మీకు చివరిదీ కూడా కాదు
ఇట్లా దొరికిపోయినప్పుడు తప్ప మేం
పేద విద్యార్థులకు రక్త సంబంధీకులమే!
దయచేసి వంటవాళ్లని ఏమనకండి
వాడు వండే ప్రతి పాకంలో
ఉప్పు తక్కువైనప్పుడల్లా
స్వేదం దారబోస్తున్నాడు!!
(మెదక్ జేఎన్టీయూ హాస్టల్లో చెట్నీలో ఎలుక ఈదులాడటం చూసి…)
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- chutney
- JNTU hostel
- medak
- rat
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

