మణిపూర్ మంటలు
మణిపూర్‌లో హింసాకాండ మరోసారి ప్రజ్వరిల్లడం ఆందోళన కలిగిస్తున్నది. ఏడాది గడుస్తున్నా అక్కడ పూర్తిస్తాయిలో శాంతి ఏర్పడలేదు. ఎన్నికల కారణంగా దేశం దృష్టి అటువైపు మళ్లనప్పటికీ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
మణిపూర్‌లో హింసాకాండ మరోసారి ప్రజ్వరిల్లడం ఆందోళన కలిగిస్తున్నది. ఏడాది గడుస్తున్నా అక్కడ పూర్తిస్తాయిలో శాంతి ఏర్పడలేదు. ఎన్నికల కారణంగా దేశం దృష్టి అటువైపు మళ్లనప్పటికీ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది మే నెల నుంచి మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాకాండ ప్రభావం అంతగా లేని జిరీబాం జిల్లాలో ఇటీవల ఘర్షణలు మొదలై పరిస్థితులు చేయిదాటిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అసోం సరిహద్దుల్లో ఉండే ఈ జిల్లాలో సోమవారం సీఎం భద్రతా కాన్వాయ్‌పై జరిగిన దాడితో మరోసారి మణిపూర్ సమస్య దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. తీవ్రవాదుల కాల్పుల్లో ఓ అధికారి, మరో సామాన్య పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు.
సీఎం బీరేన్ సింగ్ జిరీబాం సందర్శనకు ఒకరోజు ముందు ఈ దాడి జరిగింది. తన కాన్వాయ్ మీదనే తీవ్రవాదులు దాడికి తెగబడటంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం ఆయన నిస్సహాయతను సూచిస్తున్నది. ఇటీవల అదృశ్యమైన మెయితీ తెగకు చెందిన ఓ రైతు మృతదేహం జూన్ 6న కనిపించినప్పటి నుంచి జిరీబాంలో ఘర్షణలు ఉధృతరూపం దాల్చాయి. ఓ పోలీసు ఔట్‌పోస్టును, అనేక ఇండ్లను సాయుధమూకలు తగలబెట్టాయి. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. జిరీబాంలో అనేక వంతెనలను సాయుధ బృందాలు ధ్వంసం చేస్తూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వంతెనలను బాగుచేయడం పౌర యంత్రాంగం వల్ల సాధ్యపడకపోవడంతో సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరోసారి హింసాకాండ, ఘర్షణలు పేట్రేగడంతో జిరీబాం నుంచి అసోంలోకి మణిపురీల వలసలు పెరిగిపోయాయి. వరదలా వచ్చిపడుతున్న జనాన్ని ఆపేందుకు అసోం ప్రభుత్వం మణిపూర్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. మిగతా మణిపూర్‌తో పోలిస్తే నిన్నామొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న జిరీబాం ఇప్పుడు అట్టుడుకుతుండటం గమనార్హం.
డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలోని మణిపూర్ ఏడాదికాలంగా మండుతూనే ఉండటం బీజేపీ పరిపాలన సామర్థ్యానికి అద్దం పడుతున్నది. మైదాన ప్రాంతంలో నివసించే మెజారిటీ మెయితీ, కొండల్లో నివసించే మైనారిటీ గిరిజన కుకీల మధ్య ఎడతెగకుండా సాగుతున్న ఘర్షణలు రాష్ట్రంలో శాంతి లేకుండా చేశాయి. మణిపూర్‌లో ఘోరమైన ఊచకోతలు, అత్యాచారాలు జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనకు మాత్రమే తెలిసిన కారణాల వల్ల మౌనం వహిస్తున్నది. ఫలితంగా మణిపూర్ రావణకాష్టంలా మండుతూనే ఉన్నది. పరిస్థితి మరింతగా విషమించి, తీవ్రవాదం శ్రుతిమించక ముందే కేంద్రం మేల్కొని శాంతి స్థాపనకు చర్యలు చేపట్టాలి. లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లో బీజేపీ తనకున్న ఒక్క సీటునూ కోల్పోయింది. రెండు స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. మణిపూర్‌తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పరాభవం దృష్ట్యా బీజేపీ వైఖరి మార్చుకోవడం ఆ పార్టీకి శ్రేయస్కరం.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

