మహాకవి

ఎందుకో ఈ పూట
నిన్ను తలవాలనిపిస్తుంది
ఓ కవిగా, నిన్నో మహాకవిగా
పిలవాలనిపిస్తుంది
ఎన్ని సంఘటనలను
కళ్ళకత్తుకుందో నీ కలం
ఎన్ని సన్నివేశాలను
గుండెకెత్తుకుందో నీ కాగితం
జీవం నుంచి జీవితం దాకా
జీవితం నుంచి నిర్జీవం దాకా
నీటి నుంచి నిప్పు దాకా
నిప్పు నుంచి అడుగంటిన నెత్తురు దాక
ఎన్ని కవితోద్యమాలను
ఎగజిమ్మిందో నీ చింతన
ఎన్ని రసధునులను
పారించిందో నీ యోచన
నగరంలో ఎప్పుడు వానొచ్చిన
మా నయనాల ముందు
నువ్వు కవిత్వమై
కురిసినట్టుంటది
బ్రతుకులో ఎప్పుడు బాధొచ్చినా
ఆ బాదరబందీల కూటమిపై
నువ్వు నయాగరై దుమికినట్టుంటది
వచన కవితా కదనాన
జెండాపై కవిరాజా
ఎందుకో ఈ పూట
నిన్ను కొలవాలనిపిస్తుంది
ఓ కవిగా, నిన్నో మహాకవిగా
పిలవాలనిపిస్తుంది
వచన కవితా కదనరంగాన
నేడు వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు జయంతి
డాక్టర్ చింతల రాకేశ్ భవాని
92466 07551
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

