రివర్స్ పంచ్ !
కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి బీజేపీకి వెళ్లిన నేతలను కాంగ్రెస్‌లోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, తమకు అలాంటి ఆలోచనే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి బీజేపీకి వెళ్లిన నేతలను కాంగ్రెస్‌లోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, తమకు అలాంటి ఆలోచనే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ పార్టీలో చేరిన వారిని ఆహ్వానించడం పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కర్ణాటక పరిణామాలను చూస్తే, కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి భవిష్యత్ లేదని తేలిపోయిందని అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా అక్కడ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కాకుండా సీఎల్పీ నేతగా ఉన్న సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందని, ఇక్కడా అదే జరిగితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప రేవంత్‌కు కాదని అంటున్నారు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది బీజేపీలో ఉన్న నేతలు కాదని.. రేవంత్‌రెడ్డేనని కమలనాథలు సెటైర్లు విసురుతున్నారు.

హాయ్…శివ !

కర్ణాటకలో ఎట్టకేలకు సీఎం సీటుపై నెలకొన్న సందిగ్ధత తొలగినప్పటికీ, అక్కడ ముందుంది ముసళ్ల పండుగని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల దాకా పెళ్లి కొడుకు, ఆ తర్వాత తోడి పెళ్లి కొడుకు సీఎం సీట్లో కూర్చునేలా డీకే, సిద్ధు మధ్య ఒప్పందం కుదిరినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా గెలిచిన ఎమ్మెల్యేలలో 33 మంది 5 కంటే ఎక్కువసార్లు, 10 మంది ఐదవసారి గెలిచిన వారు ఉన్నట్టు లెక్క తేలింది. ఇందులో చాలా మంది పార్టీలో సీఎం సిద్ధరామయ్య కంటే సీనియర్లు కాగా, వీరిలో కనీసం సగం మంది ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ‘హాయ్ డీకే’ ‘హాయ్ శివ’ అని ఏకవచనంతో సంబోధించేంతటి చనువు ఉన్న సీనియర్లని, మున్ముందు వారందరిన కంట్రోల్ చేయడం కష్టమేనని అంటున్నారు.
తగ్గేదే లే !

కర్ణాటకలో ఈసారి మంత్రి పదవులకు అసలు గిరాకే లేకుండా పోయింది. గెలిచిన సీనియర్ నేతలంతా డిప్యూటీ సీఎం పోస్టే కావాలని పట్టుబడుతున్నారు. ఈసారి 12 మంది మంత్రులు ఓటమిపాలు కావడంతో మంత్రి పదవుల పట్ల క్రేజ్ తగ్గి డిప్యూటీ సీఎం పోస్టుకు క్రేజ్ పెరిగిందట. ఇస్తే గిస్తే డిప్యూటీ సీఎం తప్ప… తగ్గేదే లేదని పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈసారి లింగాయత్‌లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో తమకు ఒక డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచిందని, కాబట్టి తమకు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని ముస్లింలు అడుగుతున్నారు. అలాగే ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి, వీరశైవలింగాయత్లకు ఒకటి, సిద్ధరామయ్య, డీకే కంటే సీనియర్లమైన తమకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని మరో ఐదుగురు పట్టుబడుతున్నారు. వీరందరికి ఇవ్వాలంటే మంత్రి పదవులన్నీ రద్దు చేసి ఇచ్చినా సరిపోయేటట్టు లేదని కాంగ్రెస్ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కన్నడ మీడియాలో కథనాలు.
– వెల్జాల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

